ఏపీలో మందు బాబులకు షాక్ !
ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే బెల్టుషాపులు రద్దుచేసిన ప్రభుత్వం..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రంతా వైన్‌షాపులు బంద్ చేయాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే వైన్‌షాపులు తెరవాలని ఆదేశించింది. ఆరు దాటిన తర్వాత మద్యం అమ్మకాలు చేపట్టవద్దని తెలిపింది. సంపూర్ణ మద్యనిషేధం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. త్వరలోనే కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఇందులో భాగంగా ఉదయం 10 […]
ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే బెల్టుషాపులు రద్దుచేసిన ప్రభుత్వం..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాత్రంతా వైన్‌షాపులు బంద్ చేయాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే వైన్‌షాపులు తెరవాలని ఆదేశించింది. ఆరు దాటిన తర్వాత మద్యం అమ్మకాలు చేపట్టవద్దని తెలిపింది.
సంపూర్ణ మద్యనిషేధం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. త్వరలోనే కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం అమ్మకాలు జరిగేలా చూడాలని అనుకుంటోంది.
మద్యం అమ్మకాలు తగ్గాలంటే అమ్మకాల సమయాల్లోనూ మార్పులు తేవాలని యోచిస్తోంది. సాయంత్రం 6 దాటితే మద్యం అమ్మకాలు బంద్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుత ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి అమలు చేయనున్న నూతన పాలసీలో అమ్మకాల నియంత్రణకు చర్యలు చేపడుతోంది.
సాధారణంగా సాయంత్రం పూట మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఆ వేళల్లో మద్యం అమ్మకాలను నియంత్రిస్తే… ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని అనుకుంటోంది.
మరోవైపు బ్రాండ్లను కూడా తగ్గించాలని ప్రయత్నిస్తోంది. పరిమితమైన బ్రాండ్లను మాత్రమే అమ్మేలా చూసి… మిగతా వాటన్నిటికి స్వస్తి పలకాలని చూస్తోంది. ఇది కూడా అమ్మకాలు తగ్గించేందుకు దోహదం చేస్తుందనేది ప్రభుత్వం ఆలోచన.