Telugu Global
NEWS

ప్రపంచకప్ సెమీస్ లో ఏడోసారి భారత్

ప్రపంచకప్ సెమీస్ లో 8వసారి న్యూజిలాండ్  సెమీస్ లో భారత్ కు 3-3 రికార్డు సెమీస్ లో కివీస్ కు 1-6 రికార్డు వన్డే ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ తొలి సెమీస్ లో ఓ ఆసక్తికరమైన పోరుకు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. ఈ పోరులో రెండో ర్యాంకర్ భారత్ కు…3వ ర్యాంకర్ న్యూజిలాండ్ సవాలు విసురుతోంది. రెండుజట్లు ఫైనల్లో చోటు సాధించాలన్న పట్టుదలతో సమరానికి సై అంటున్నాయి…. ఇంగ్లండ్ గడ్డపై గత […]

ప్రపంచకప్ సెమీస్ లో ఏడోసారి భారత్
X
  • ప్రపంచకప్ సెమీస్ లో 8వసారి న్యూజిలాండ్
  • సెమీస్ లో భారత్ కు 3-3 రికార్డు
  • సెమీస్ లో కివీస్ కు 1-6 రికార్డు

వన్డే ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ తొలి సెమీస్ లో ఓ ఆసక్తికరమైన పోరుకు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. ఈ పోరులో రెండో ర్యాంకర్ భారత్ కు…3వ ర్యాంకర్ న్యూజిలాండ్ సవాలు విసురుతోంది. రెండుజట్లు ఫైనల్లో చోటు సాధించాలన్న పట్టుదలతో సమరానికి సై అంటున్నాయి….

ఇంగ్లండ్ గడ్డపై గత ఐదువారాలుగా జరుగుతున్న 2019 వన్డే ప్రపంచకప్ లో లీగ్ దశ ముగిసి…సెమీఫైనల్స్ నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

పది జట్ల రౌండ్ రాబిన్ లీగ్ పోరులో టేబుల్ టాపర్ గా నిలిచిన రెండో ర్యాంకర్ భారత్ కు…నాలుగో స్థానంలో నిలిచిన ప్రపంచ మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ సవాలు విసురుతోంది.

రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఈ రెండుజట్ల మధ్య జరగాల్సిన పోటీ వానదెబ్బతో రద్దుకావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.

ఏడోసారి సెమీస్ లో భారత్…

ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు ఏడోసారి ప్రపంచకప్ సెమీస్ కు అర్హత సంపాదించింది.

1983 నుంచి 2015 ప్రపంచకప్ వరకూ జరిగిన 11 టోర్నీలలో ఆరుసార్లు సెమీస్ ఆడిన అనుభవం భారత్ కు ఉంది.

మాంచెస్టర్లో తొలి గెలుపు…

1983 ప్రపంచకప్ లో తొలిసారిగా సెమీస్ కు అర్హత సాధించిన భారత్ ఆతిథ్య ఇంగ్లండ్ ను 6 వికెట్లతో చిత్తు చేసింది. అదే టోర్నీలో విశ్వవిజేతగా నిలిచింది.

ఆ తర్వాత భారత గడ్డపై జరిగిన 1987 ప్రపంచకప్ లో సైతం భారత్ సెమీస్ చేరినా…ఇంగ్లండ్ చేతిలో పరాజయం పొందక తప్పలేదు.

1996 ప్రపంచకప్ లో సైతం సెమీస్ కు అర్హత సాధించిన భారత్ కు…శ్రీలంక చేతిలో ఘోరపరాభవం ఎదురయ్యింది.

సౌతాఫ్రికా వేదికగా ముగిసిన 2003 ప్రపంచకప్ సెమీస్ లో భారతజట్టు …కెన్యాను 91 పరుగులతో చిత్తు చేసి ఫైనల్స్ కు అర్హత సాధించినా…టైటిల్ సమరంలో ఆస్ట్రేలియా చేతిలో కంగుతినాల్సి వచ్చింది.

ముంబైలో సెమీస్ గెలుపు..

భారత ఉపఖండ దేశాలు వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ లో ..ధోనీ నాయకత్వంలోని భారతజట్టు సెమీస్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 29 పరుగులతో ఓడించి…ఫైనల్ చేరడమే కాదు…టైటిల్ పోరులో శ్రీలంకపై నెగ్గి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది.

నాలుగేళ్ల క్రితం ముగిసిన 2015 ప్రపంచకప్ సెమీస్ చేరినా…ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగుల భారీ తేడాతో భారత్ కు ఓటమి తప్పలేదు. ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్ లో మాత్రం భారత్ హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.

న్యూజిలాండ్ రికార్డు బ్యాడ్ బ్యాడ్…

ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరడం న్యూజిలాండ్ కు ఇదే మొదటిసారి కాదు. 1975 ప్రారంభ ప్రపంచకప్ నుంచి 2015 ప్రపంచకప్ వరకూ ఏడుసార్లు సెమీస్ చేరిన న్యూజిలాండ్ 1-6 విజయాలతో మాత్రమే ఉంది.

1975, 1979, 1992, 1999, 2007 2011, 2015 ప్రపంచకప్ టోర్నీల సెమీస్ చేరిన న్యూజిలాండ్ ఒకే ఒక్కసారి ఫైనల్స్ చేరగలిగింది. మిగిలిన అరుసార్లు సెమీస్ లో పరాజయాలు పొందక తప్పలేదు.

భారత్ తో మరికొద్ది గంటల్లో జరిగే సెమీస్ సమరంలో న్యూజిలాండ్ కు అంతంత మాత్రమే విజయావకాశాలున్నాయి. న్యూజిలాండ్ కంటే భారత్ కే సెమీస్ లో విజయంశాతం అధికంగా ఉంది.

First Published:  8 July 2019 5:43 PM IST
Next Story