ఓఎంసీ కేసులో జగన్ పేరు చెప్పాలని చంద్రబాబు ఒత్తిడి " సి. శశికుమార్
ఓబులాపురం మైనింగ్ కేసులో జగన్ పేరు చెప్పాల్సిందిగా తనపై చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని ఈ కేసులో సాక్షిగా ఉన్న సి. శశికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కానీ తాను అందుకు అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి చంద్రబాబు తనకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని శశికుమార్ వివరించారు. టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్న చెన్నంశెట్టి శశికుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగానే చంద్రబాబు గురించి పలు విషయలు చెప్పారు. […]
ఓబులాపురం మైనింగ్ కేసులో జగన్ పేరు చెప్పాల్సిందిగా తనపై చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని ఈ కేసులో సాక్షిగా ఉన్న సి. శశికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కానీ తాను అందుకు అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి చంద్రబాబు తనకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని శశికుమార్ వివరించారు.
టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్న చెన్నంశెట్టి శశికుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగానే చంద్రబాబు గురించి పలు విషయలు చెప్పారు.
టీడీపీలో 30 ఏళ్ల పాటు పార్టీకి విధేయుడిగా పనిచేస్తే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కనీసం పట్టించుకున్న పాపానపోలేదన్నారు.
తన సోదరుడు సీ. రామచంద్రయ్యను కాదని టీడీపీలో కొనసాగినప్పటికీ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
ఓఎంసీ కేసులో జగన్ మోహన్ రెడ్డిని ఇరికించేలా తాను చేయలేదన్న కోపంతోనే చంద్రబాబు ఇలా వ్యవహరించారని శశికుమార్ ఆరోపించారు. టీడీపీ ఇక కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. చంద్రబాబు కేవలం తన సొంత సామాజికవర్గం వారికి మాత్రమే పదవులు కేటాయిస్తూ వచ్చారని ఆయన ఆరోపించారు.