Telugu Global
NEWS

అవి తానా సభలు కాదు... టీడీపీ భజన సభలు " లోకేష్‌పై కన్నా ఫైర్

అమెరికాలో జరుగుతున్న తానా సభలకు పిలిచి మరీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను అవమానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. తానా సభలను టీడీపీ భజన సభలుగా… కన్నా అభివర్ణించారు. పచ్చ తమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువారి ప్రతిష్టను దిగజారుస్తున్నారని విరుచుకుపడ్డారు. రాంమాధవ్‌ను ఆహ్వానించి ఆయన ప్రసంగిస్తున్న సమయంలో అడ్డు తగిలి లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ధిని బయటపెట్టుకుందని కన్నా విమర్శించారు. ఏపీలో టీడీపీ చేస్తున్న బురద రాజకీయాల్లో నుంచే […]

అవి తానా సభలు కాదు... టీడీపీ భజన సభలు  లోకేష్‌పై కన్నా ఫైర్
X

అమెరికాలో జరుగుతున్న తానా సభలకు పిలిచి మరీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను అవమానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు.

తానా సభలను టీడీపీ భజన సభలుగా… కన్నా అభివర్ణించారు. పచ్చ తమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువారి ప్రతిష్టను దిగజారుస్తున్నారని విరుచుకుపడ్డారు.

రాంమాధవ్‌ను ఆహ్వానించి ఆయన ప్రసంగిస్తున్న సమయంలో అడ్డు తగిలి లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ధిని బయటపెట్టుకుందని కన్నా విమర్శించారు. ఏపీలో టీడీపీ చేస్తున్న బురద రాజకీయాల్లో నుంచే కమలవికాసం జరుగుతుందని కన్నా ధీమా వ్యక్తం చేశారు.

తానా సభలకు వెళ్లిన రాంమాధవ్‌ వేదికపై ప్రసంగిస్తుండగా టీడీపీ అభిమానులు అడ్డుతగిలారు. రాంమాధవ్‌, బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఆయన మధ్యలోనే వేదిక దిగాల్సి వచ్చింది.

వేదిక దిగి వెళ్లిపోతున్న సమయంలోనూ కొందరు వెంటబడి గేలి చేశారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ తానా సభలను టీడీపీ భజన సభలుగా అభివర్ణించారు.

First Published:  8 July 2019 6:46 AM IST
Next Story