Telugu Global
NEWS

వన్డే క్రికెట్లో తిరుగులేని టీమిండియా

ప్రపంచ నంబర్ వన్ గా విరాట్ కొహ్లీ ప్రపంచ రెండో ర్యాంకులో రోహిత్ శర్మ టీమ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ ఐసీసీ వన్డే క్రికెట్ టీమ్, వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. టీమ్ ర్యాంకింగ్స్ లో కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా.. తన టాప్ ర్యాంక్ ను నిలుపుకోగలిగింది. ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ 45మ్యాచ్ లు ముగిసిన తర్వాత..ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్ ప్రకటించింది. 10 జట్ల లీగ్ టేబుల్ టాపర్ గా టీమిండియా నిలిస్తే …ఓపెనర్ […]

వన్డే క్రికెట్లో తిరుగులేని టీమిండియా
X
  • ప్రపంచ నంబర్ వన్ గా విరాట్ కొహ్లీ
  • ప్రపంచ రెండో ర్యాంకులో రోహిత్ శర్మ
  • టీమ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్

ఐసీసీ వన్డే క్రికెట్ టీమ్, వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. టీమ్ ర్యాంకింగ్స్ లో కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా.. తన టాప్ ర్యాంక్ ను నిలుపుకోగలిగింది.

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ 45మ్యాచ్ లు ముగిసిన తర్వాత..ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్ ప్రకటించింది. 10 జట్ల లీగ్ టేబుల్ టాపర్ గా టీమిండియా నిలిస్తే …ఓపెనర్ రోహిత్ శర్మ 647 పరుగులతో టాప్ స్కోరర్ గా చరిత్ర సృష్టించాడు.

విరాట్ కొహ్లీ నంబర్ వన్…

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…ప్రపంచకప్ 8 లీగ్ మ్యాచ్ ల్లో 442 పరుగులతో సహా 63.42 సగటుతో తన నంబర్ వన్ ర్యాంక్ ను నిలుపుకొని… అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వరుసగా ఐదు హాఫ్ సెంచరీలతో 891 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు.

ఇక …డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రపంచకప్ 8 ఇన్నింగ్స్ లో 5 సెంచరీలతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాదు..రెండోర్యాంక్ లో నిలిచాడు.

రోహిత్ 885 పాయింట్లతో తన కెరియర్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. పాక్ ఆటగాడు బాబర్ అజామ్ మూడు, కివీకెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ నాలుగు ర్యాంకుల్లో నిలిచారు.

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టాప్ టెన్ ర్యాంకుల్లో నిలిచాడు.

బౌలర్ నంబర్ వన్ బుమ్రా…

బౌలర్ల ర్యాంకింగ్స్ లో జస్ ప్రీత్ బుమ్రా తన టాప్ ర్యాంక్ ను విజయవంతంగా నిలబెట్టుకొన్నాడు. ప్రపంచకప్ 8 మ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టడం ద్వారా బుమ్రా 51 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండో ర్యాంక్ లో నిలిచాడు.

First Published:  8 July 2019 1:37 AM IST
Next Story