పంజాగుట్ట హత్యలపై డీజీపీ గరంగరం
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, ఇతర సంస్థలకు నెలవైన పంజాగుట్టలో 10 రోజుల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయి. అవి కూడా నడిరోడ్డుపై కత్తులతో అందరూ చూస్తుండగానే పొడిచి చంపిన ఘటనలు… స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. గత నెల 26న ఆటో డ్రైవర్ అన్వర్‌ను రియాసత్ అనే మరో డ్రైవర్ నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ […]
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, ఇతర సంస్థలకు నెలవైన పంజాగుట్టలో 10 రోజుల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయి. అవి కూడా నడిరోడ్డుపై కత్తులతో అందరూ చూస్తుండగానే పొడిచి చంపిన ఘటనలు… స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి.
గత నెల 26న ఆటో డ్రైవర్ అన్వర్‌ను రియాసత్ అనే మరో డ్రైవర్ నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. అన్వర్ పోలీస్ స్టేషన్‌లోపలికి పరిగెత్తి పడిపోయి మృతి చెందాడు. ఇది జరిగి 10 రోజులు కాకముందే విజయవాడకు చెందిన రాంప్రసాద్ అనే వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా నరికారు.
ఈ రెండు ఘటనలు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగాయి. రెండింటిలోనూ పాత కక్షలే కారణం అయినప్పటకీ.. నిందితులు పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే ఉందనే భయమే లేకుండా హత్యలకు తెగబడ్డారు.
ఈ దారుణ హత్యలపై డీజీపీ మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ ఉదయం సీపీ అంజనీకుమార్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలపై ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. వెంటనే విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. పిర్యాదుదారులకు జవాబుదారీగా ఉండాలని.. నిబద్దతతో పని చేయాలని ఆయన సూచించారు.