Telugu Global
NEWS

కోపా అమెరికాకప్ విజేత బ్రెజిల్

ఫైనల్లో పెరూ పై 3-1 గోల్స్ విజయం  తొమ్మిదోసారి కోపాకప్ నెగ్గిన సాంబా టీమ్ లాటిన్ అమెరికా సాకర్ చాంపియన్లకు ఇచ్చే కోపా అమెరికాకప్ ను బ్రెజిల్ తొమ్మిదోసారి గెలుచుకొంది. బ్రెజిల్ లోని వివిధ నగరాలలో గత మూడువారాలుగా సాగిన ఈ టోర్నీలో మూడో ర్యాంక్ బ్రెజిల్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. రియో డి జెనీరోలోని మర్కానా స్టేడియంలో…80వేల మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ పోరులో బ్రెజిల్ కేవలం 10 మంది ఆటగాళ్లతోనే పోరాడి విజేతగా నిలిచింది. […]

కోపా అమెరికాకప్ విజేత బ్రెజిల్
X
  • ఫైనల్లో పెరూ పై 3-1 గోల్స్ విజయం
  • తొమ్మిదోసారి కోపాకప్ నెగ్గిన సాంబా టీమ్

లాటిన్ అమెరికా సాకర్ చాంపియన్లకు ఇచ్చే కోపా అమెరికాకప్ ను బ్రెజిల్ తొమ్మిదోసారి గెలుచుకొంది. బ్రెజిల్ లోని వివిధ నగరాలలో గత మూడువారాలుగా సాగిన ఈ టోర్నీలో మూడో ర్యాంక్ బ్రెజిల్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.

రియో డి జెనీరోలోని మర్కానా స్టేడియంలో…80వేల మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ పోరులో బ్రెజిల్ కేవలం 10 మంది ఆటగాళ్లతోనే పోరాడి విజేతగా నిలిచింది. రెండోసారి ఎల్లో కార్డు అందుకొని జీసస్ ఆట నుంచి తప్పుకోడంతో…బ్రెజిల్ కేవలం 10 మంది సభ్యులతోనే పోరాడవలసి వచ్చింది.

ఆట మొదటి భాగానికే ఆతిథ్య బ్రెజిల్ కీలక గోల్స్ తో 1-0 ఆధిక్యం సంపాదించింది. అయితే…పెనాల్టీ ద్వారా సాధించిన గోల్ తో పెరూ 1-1తో స్కోరు సమం చేయగలిగింది.

ఆట రెండో భాగంలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన బ్రెజిల్ మరో రెండుగోల్స్ తో మ్యాచ్ ను 3-1 తో ముగించి ట్రోఫీ అందుకొంది. 2007 తర్వాత బ్రెజిల్ …కోపా అమెరికాకప్ విజేతగా నిలవడం ఇదే మొదటిసారి.

కోపా అమెరికాకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ప్రతిసారీ బ్రెజిల్ జట్టే చాంపియన్ గా నిలవడం విశేషం.

First Published:  8 July 2019 4:48 AM IST
Next Story