వన్డే క్రికెట్ కు షోయబ్ మాలిక్ గుడ్ బై
2019 ప్రపంచకప్ తో అల్విదా పాక్ క్రికెట్ కు రెండుదశాబ్దాలుగా సేవ హైదరాబాద్ అల్లుడు, సానియా భర్త షోయబ్ మాలిక్ ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న 2019 వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగియటంతో..పలు దేశాల వెటరన్ క్రికెటర్లు రిటైర్మెంట్ రాగం అందుకొన్నారు. పాకిస్థాన్ కు గత రెండుదశాబ్దాలుగా ఆడుతున్న మాజీ కెప్టెన్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ సైతం వన్డే క్రికెట్ నుంచి రిటైరైనట్లు ప్రకటించాడు. 287 వన్డేలు, 7వేల పరుగులు… పాక్ […]
- 2019 ప్రపంచకప్ తో అల్విదా
- పాక్ క్రికెట్ కు రెండుదశాబ్దాలుగా సేవ
- హైదరాబాద్ అల్లుడు, సానియా భర్త షోయబ్ మాలిక్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న 2019 వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగియటంతో..పలు దేశాల వెటరన్ క్రికెటర్లు రిటైర్మెంట్ రాగం అందుకొన్నారు.
పాకిస్థాన్ కు గత రెండుదశాబ్దాలుగా ఆడుతున్న మాజీ కెప్టెన్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ సైతం వన్డే క్రికెట్ నుంచి రిటైరైనట్లు ప్రకటించాడు.
287 వన్డేలు, 7వేల పరుగులు…
పాక్ క్రికెట్ కు గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న 37 ఏళ్ల షోయబ్ మాలిక్ కు 287 వన్డే మ్యాచ్ ల్లో 7వేల 534 పరుగులు చేసిన రికార్డు ఉంది. ఇందులో తొమ్మిది సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. ఆఫ్ స్పిన్ బౌలర్ గా షోయబ్ 158 వికెట్లు పడగొట్టాడు.
తనకు అండగా నిలిచిన అభిమానులకు, సహఆటగాళ్లకు, శిక్షకులకు షోయబ్ కృతజ్ఞతలు తెలిపాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్తగా గుర్తింపు తెచ్చుకొన్న షోయబ్ మాలిక్… టీ-20 ఫార్మాట్లో కొనసాగనున్నాడు.