Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి వెళ్లింది తానా కోసం కాదట....

తాజాగా జక్కన్న రాజమౌళి అమెరికా వాషింగ్టన్ లోని ఎయిర్ పోర్ట్ లో తానా మ్యూజికల్ నైట్ బృందంతో కనిపించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కానీ తానా గురించి రియాక్ట్ అయిన రాజమౌళి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేసింది. ఆ ఫోటోలు చూస్తే తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన రాజమౌళి ని ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు రాజమౌళి మాత్రం నేను తానా కు అటెండ్ […]

రాజమౌళి వెళ్లింది తానా కోసం కాదట....
X

తాజాగా జక్కన్న రాజమౌళి అమెరికా వాషింగ్టన్ లోని ఎయిర్ పోర్ట్ లో తానా మ్యూజికల్ నైట్ బృందంతో కనిపించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కానీ తానా గురించి రియాక్ట్ అయిన రాజమౌళి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేసింది. ఆ ఫోటోలు చూస్తే తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన రాజమౌళి ని ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తుంది.

మరోవైపు రాజమౌళి మాత్రం నేను తానా కు అటెండ్ అవ్వటం లేదు అంటూ ట్వీట్ చేశారు. తాను అమెరికా వెళ్లింది తానా కోసం కాదు అంటూ కుండబద్దలు కొట్టేశారు.

“ఫ్రెండ్స్ నేను వాషింగ్టన్ కి ఒక పర్సనల్ పని మీద వచ్చాను. తానా కోసం కాదు. పెద్దన్న మ్యూజికల్ షో కి నేను హాజరు కాలేక పోవచ్చు. నేను వస్తాను అనుకున్నవాళ్ళు రాలేదని డిసప్పాయింట్ అవ్వకూడదని ఇలా క్లారిటీగా క్లారిఫికేషన్ ఇస్తున్నాను” అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

మరి తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన రాజమౌళి ని ఎందుకు ఆహ్వానించారు అనేది అసలు ప్రశ్న. నిజానికి ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ లిస్ట్ లో కూడా రాజమౌళి పేరు లేదట.

రాజమౌళి నిజంగానే పర్సనల్ పనిమీద అమెరికా వెళ్లారని… కానీ యాదృచ్చికంగా తానా ఆర్గనైజర్స్ అక్కడ ఇతర గెస్ట్ లను ఆహ్వానిస్తున్న సమయంలో రాజమౌళి కనిపించడంతో ఆయన వద్దకు వెళ్లి తానా కి రమ్మని పిలిచినట్టు తెలుస్తోంది.

ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో రాజమౌళి వెంటనే క్లారిటీ ఇచ్చాడట.

First Published:  6 July 2019 7:08 AM IST
Next Story