Telugu Global
International

మనుషులను కలిపేందుకే తానా సభలకు వచ్చా " పవన్‌ కళ్యాణ్

అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ప్రసంగించారు. గత ఎన్నికల్లో ఓటమి తనను మరింత బలోపేతం చేసిందన్నారు. ఫలితం వచ్చాక అపజయం నుంచి కోలుకోవడానికి తనకు కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టిందన్నారు. చిన్నప్పటి నుంచి ఓటమి తనకు మామూలేనన్నారు. విలువల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఓటమికి భయపడలేదన్నారు. చదువులో తాను ఫెయిల్ అవడానికి కారణం తాను చదవలేక కాదని… ఆ చదువులో క్రియేటివిటీ లేకపోవడం వల్లే తాను చదువులో ఫెయిల్ […]

మనుషులను కలిపేందుకే తానా సభలకు వచ్చా  పవన్‌ కళ్యాణ్
X

అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ప్రసంగించారు. గత ఎన్నికల్లో ఓటమి తనను మరింత బలోపేతం చేసిందన్నారు. ఫలితం వచ్చాక అపజయం నుంచి కోలుకోవడానికి తనకు కేవలం 10 నిమిషాలు మాత్రమే పట్టిందన్నారు.

చిన్నప్పటి నుంచి ఓటమి తనకు మామూలేనన్నారు. విలువల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఓటమికి భయపడలేదన్నారు. చదువులో తాను ఫెయిల్ అవడానికి కారణం తాను చదవలేక కాదని… ఆ చదువులో క్రియేటివిటీ లేకపోవడం వల్లే తాను చదువులో ఫెయిల్ అయ్యేవాడినన్నారు. గెలుపు కోసం చాలా సహనంతో ఎదురుచూసే గుణం తనది అన్నారు.

తానా సభకు వస్తుంటే కొందరు రావొద్దని… కొందరు రండి అని చెబుతుంటే బాధేసిందన్నారు. కులాలుగా, మతాలుగా ఎందుకు విడిపోవాలని ప్రశ్నించారు. తానా సభలకు పవన్ ఎందుకు వెళ్లారు? అన్న దానిపై కంటే… డబ్బులేని రాజకీయాలు తీసుకురావడం ఎలా? అన్న దానిపై చర్చ పెడితే బాగుంటుందన్నారు.

తనకు కులం, మతం తెలియదన్నారు. ప్రాంతీయ విధ్వేషాల గురించి తెలియదన్నారు. మనుషులను కలపడానికే తాను తానా సభలకు వచ్చానన్నారు. సత్యాన్ని మాట్లాడే తనకేంటీ ఇబ్బంది? అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తనను కూడా ఓడిస్తారని తనకు ముందే తెలుసన్నారు. కానీ మార్పు కోసం ముందడుగు వేయాలనే పోటీ చేశానన్నారు.

ఇటీవల రివ్యూ మీటింగ్‌ నిర్వహిస్తే…. హాజరైన ఒక వ్యక్తి తనకు సలహాలు ఇస్తుంటే…. ఓటేశావా అని అడిగానని… అందుకు అతడు వేరే పార్టీకి ఓటేసినట్టు చెప్పారన్నారు. సలహాలు ఇచ్చేది నాకు… ఓటేసేది వేరొకరికా? అని పవన్‌ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజలు నాయకుడిని ప్రేమించి ఓటేస్తారే గానీ.. భయపడి ఓటేయరన్నారు. నాయకుడిని చూసి జనం భయపడుతున్నారంటే వారు పతనం వైపు వెళ్తున్నారనే అర్థం అని అన్నారు.

తాను కోరికలు లేని వ్యక్తినన్నారు. జీవితమే తనను ఒక నటుడిని చేసిందన్నారు. సమాజంలోని అసమానతలే తనను చాలా బాధించేవన్నారు. జనసేన పార్టీని ఆలోచించే పెట్టానన్నారు. దేశసమగ్రతకు భంగం వాటిల్లుతోందన్న భయంతో ఆ పరిస్థితిని నివారించేందుకు ముందుకొచ్చానన్నారు.

First Published:  6 July 2019 4:14 AM IST
Next Story