Telugu Global
NEWS

క్రీడారంగానికీ కంటితుడుపు కేటాయింపులే

కేంద్ర బడ్జెట్ లో జాతీయ క్రీడాభివృద్ధి కార్యక్రమం క్రీడాకారుల ప్రోత్సాహానికి 411 కోట్లు జాతీయ క్రీడా సంఘాలకు కేటాయింపుల్లో కోత జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ఒలింపిక్స్ పతకాల పట్టిక మొదటి 50 స్థానాలలో చోటు సంపాదించలేకపోతోంది. దీనికి కారణం..క్రీడారంగానికి తగిన ప్రోత్సాహం లేకపోవడమేనని మరోసారి తేలిపోయింది. పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో క్రీడారంగానికి కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 130 కోట్ల జనాభాకు తగ్గట్టుగా నిధులు కేటాయించలేకపోయారు. […]

క్రీడారంగానికీ కంటితుడుపు కేటాయింపులే
X
  • కేంద్ర బడ్జెట్ లో జాతీయ క్రీడాభివృద్ధి కార్యక్రమం
  • క్రీడాకారుల ప్రోత్సాహానికి 411 కోట్లు
  • జాతీయ క్రీడా సంఘాలకు కేటాయింపుల్లో కోత

జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ఒలింపిక్స్ పతకాల పట్టిక మొదటి 50 స్థానాలలో చోటు సంపాదించలేకపోతోంది. దీనికి కారణం..క్రీడారంగానికి తగిన ప్రోత్సాహం లేకపోవడమేనని మరోసారి తేలిపోయింది.

పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో క్రీడారంగానికి కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 130 కోట్ల జనాభాకు తగ్గట్టుగా నిధులు కేటాయించలేకపోయారు.

క్రీడలకోసం సరికొత్త సంస్థ…

దేశంలో క్రీడారంగ అభివృద్ధి, ప్రగతి కోసం…కేంద్ర ఆర్ధిక మంత్రి…తొలిసారిగా నేషనల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే ఖేలో ఇండియా పథకం ద్వారా..ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెస్తున్న ప్రభుత్వం కనీస అవసరాలకు తగ్గట్టుగా మాత్రమే నిధులు కేటాయించింది.

కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు..2 వేల 216 కోట్ల 92 లక్షల రూపాయలు కేటాయించింది. గత బడ్జెట్ కేటాయింపుల కంటే…214 కోట్ల 20 లక్షల రూపాయలు అదనంగా కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

స్పోర్ట్స్ అథారిటీకి భారీగా నిధులు…

జాతీయ క్రీడాభివృద్ధి సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రస్తుత బడ్జెట్ లో భారీగా నిధులు పెంచారు. 55 కోట్ల రూపాయల నుంచి 450 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయి.

ఖేలో ఇండియాకు 601 కోట్లు…

ప్రధాని నరేంద్ర మోడీ కలల పథకం ఖేలో ఇండియాకు…50 కోట్ల 31 లక్షల రూపాయలు అదనంగా పెంచారు. 550 కోట్ల 69 లక్షల రూపాయల నుంచి 601 కోట్ల రూపాయలకు కేటాయింపులు పెరిగాయి.

జాతీయ క్రీడాభివృద్ధి సంస్థకు 2కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయల మేర నిధులు పెంచారు.

ప్రోత్సాహక నగదు 89 కోట్లు….

అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులుగా ఇచ్చే మొత్తం కోసం సైతం నిధులను మరింతగా పెంచారు.

గత బడ్జెట్ లో 63 కోట్లుగా ఉన్న నిధులు…ప్రస్తుత బడ్జెట్ లో 89 కోట్ల రూపాయలకు పెరిగింది.

జాతీయ క్రీడాసంఘాలకు ఇచ్చే మొత్తాన్ని 245 కోట్ల 13 లక్షల రూపాయల నుంచి 245 కోట్లకు తగ్గించారు.

క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతులు, అవార్డుల కోసం.. బడ్జెట్ కేటాయింపులను 316 కోట్ల 93 లక్షల నుంచి 411 కోట్ల రూపాయలకు పెంచడం విశేషం.

క్రీడామంత్రి హర్షం…

క్రీడారంగానికి బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం అండగా నిలవడం పట్ల కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజ్జూ సంతోషం వ్యక్తం చేశారు.

క్రీడారంగానికి తగినంతగా నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

లక్షల కోట్ల జాతీయ బడ్జెట్ లో క్రీడారంగం కోసం 2వేల 216 కోట్ల 92 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించడం చూస్తే…మన క్రీడారంగం ఏ విధంగా ప్రగతి సాధిస్తుందో…కేంద్ర ప్రభుత్వానికే తెలియాలి.

First Published:  6 July 2019 2:20 AM IST
Next Story