నాదెండ్ల ఫ్యామిలీ.... తండ్రి ఒకచోట.... కుమారుడు ఒకచోట
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన అమిత్ షా బహిరంగ సభలో నాదెండ్ల కాషాయంలో కలిసిపోయారు. భాస్కరరావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా బీజేపీలో చేరారు. గతంలో ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టి నాదెండ్ల కొద్దికాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో ఉన్నారు. అయితే భాస్కరరావు మాత్రం […]
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన అమిత్ షా బహిరంగ సభలో నాదెండ్ల కాషాయంలో కలిసిపోయారు. భాస్కరరావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా బీజేపీలో చేరారు.
గతంలో ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టి నాదెండ్ల కొద్దికాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో ఉన్నారు.
అయితే భాస్కరరావు మాత్రం జనసేన విషయంలో తొలి నుంచి స్పష్టతతోనే ఉన్నారు. జనసేన ఏమీ సాధించలేదన్న భావనతోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు బీజేపీలో చేరారు.