చంద్రబాబు ఆరో కేటగిరిలో ఉన్నారు- విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. లోకేష్ వరుస ట్వీట్ల పైనా స్పందించారు. తనకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన విజయసాయిరెడ్డి…. కొత్తగా దాడి నాటకానికి చంద్రబాబు ఏమైనా ప్లాన్ చేశారా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. జైలుకు పంపుతారేమోనన్న అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుంది. తనను […]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. లోకేష్ వరుస ట్వీట్ల పైనా స్పందించారు. తనకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన విజయసాయిరెడ్డి…. కొత్తగా దాడి నాటకానికి చంద్రబాబు ఏమైనా ప్లాన్ చేశారా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. జైలుకు పంపుతారేమోనన్న అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు.
అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుంది. తనను అరెస్ట్ చేస్తే చుట్టూ నిలబడి రక్షణ కల్పించాలని గతంలో ప్రజలను వేడుకున్నారు.తనకేదైనా అయితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని ఇప్పుడు బెదిరిస్తున్నారు.దాడి నాటకానికి ప్లాన్ చేశారా ఏంటి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2019
లోకేష్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేసేందుకు జాకీలు పెట్టి లేపుతున్నారన్నారు. అందులో భాగంగానే తండ్రి సైగ చేయగానే ట్విట్టర్ లో లోకేష్ నవ్వులు పూయిస్తున్నారన్నారు.
లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2019
ఇప్పటి వరకు ప్రపంచ మనుషుల్లో గుర్తించిన ఫోబియాలను ఐదు రకాలుగా విభజించారని… కానీ చంద్రబాబు మానసిక స్థితి ఆరో కేటగిరిలో ఉందన్నారు. అందుకే ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కడప, పులివెందులలాగా మారుస్తున్నారంటూ అకారణ భీతిని వ్యక్తం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫోభియాలను సైకాలజీ 5 కేటగిరీలుగా విభజించింది.చంద్రబాబు గారికి సైకియాట్రిక్ పరీక్షలు చేస్తే ఆరో కేటగిరి కూడా ఉందని తేలుతుంది.ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కడప,పులివెందులలాగా మారుస్తున్నారని పదేపదే తన అకారణ భీతిని(ఫోభియా) వ్యక్తం చేస్తుంటారాయన.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2019