Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించిన తెలుగింటి కోడలు

కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టారు. ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అయితే తన తొలి పద్దులో సంస్కరణలకు పెద్దపీట వేసిన నిర్మల…. తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం మొండి చేయి చూపించారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే […]

తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించిన తెలుగింటి కోడలు
X

కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టారు. ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

అయితే తన తొలి పద్దులో సంస్కరణలకు పెద్దపీట వేసిన నిర్మల…. తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం మొండి చేయి చూపించారు.

కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే చేయలేదని…. విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైలుకు నిధుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు.

లోటు బడ్జెట్‌లో నడుస్తున్న ఏపీకి అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. కేంద్రం ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు.

ఏపీతో పాటు తెలంగాణకు కూడా అదనంగా దక్కిన ప్రయోజనం ఏమీ లేదని.. దీనిపై పార్లమెంటులో తప్పక నిలదీస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీకి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో బడ్జెట్‌లో ప్రస్తావించలేదని.. దీంతో గందరగోళం నెలకొన్నదని విజయసాయిరెడ్డి అన్నారు.

First Published:  5 July 2019 10:33 AM IST
Next Story