Telugu Global
NEWS

కోపా అమెరికాకప్ టోర్నీలో టైటిల్ సమరం

ఫైనల్లో బ్రెజిల్ కు పెరూ సవాల్  9వ కోపా టైటిల్ కు గురిపెట్టిన బ్రెజిల్  సెమీస్ లోనే ముగిసిన అర్జెంటీనా, చిలీజట్ల పోటీ లాటిన్ అమెరికా ఖండ దేశాల సాకర్ సమరం కోపా అమెరికాకప్ టోర్నీ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. సాంబా గడ్డపై గత రెండువారాలుగా జరుగుతున్న ఈ టోర్నీ టైటిల్ సమరానికి ఆతిథ్య బ్రెజిల్, డార్క్ హార్స్ పెరూ జట్లు చేరుకొన్నాయి. మరకానా స్టేడియం వేదికగా జరిగే టైటిల్ ఫైట్ కోసం బ్రెజిల్, పెరూ జట్లు […]

కోపా అమెరికాకప్ టోర్నీలో టైటిల్ సమరం
X
  • ఫైనల్లో బ్రెజిల్ కు పెరూ సవాల్
  • 9వ కోపా టైటిల్ కు గురిపెట్టిన బ్రెజిల్
  • సెమీస్ లోనే ముగిసిన అర్జెంటీనా, చిలీజట్ల పోటీ

లాటిన్ అమెరికా ఖండ దేశాల సాకర్ సమరం కోపా అమెరికాకప్ టోర్నీ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. సాంబా గడ్డపై గత రెండువారాలుగా జరుగుతున్న ఈ టోర్నీ టైటిల్ సమరానికి ఆతిథ్య బ్రెజిల్, డార్క్ హార్స్ పెరూ జట్లు చేరుకొన్నాయి.

మరకానా స్టేడియం వేదికగా జరిగే టైటిల్ ఫైట్ కోసం బ్రెజిల్, పెరూ జట్లు మాత్రమే కాదు…ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు.

చిలీకి పెరూ షాక్…

భారీ అంచనాల మధ్య టైటిల్ వేటకు దిగిన డిఫెండింగ్ చాంపియన్ చిలీని పెరూజట్టు చావుదెబ్బ కొట్టింది. ఏకపక్షంగా సాగిన రెండో సెమీస్ లో పెరూ 3-0 గోల్స్ తో ప్రస్తుత చాంపియన్ చిలీని కంగు తినిపించింది.

లీగ్ దశలో మాజీ చాంపియన్ ఉరుగ్వేని, సెమీస్ లో చిలీని ఓడించడం ద్వారా…పెరూ 1982 తర్వాత తొలిసారిగా టైటిల్ ఫైట్ కు అర్హత సంపాదించింది.

అర్జెంటీనాకు బ్రెజిల్ కిక్…

అంతకు ముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య బ్రెజిల్ 2-0 గోల్స్ తో చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనాను అధిగమించింది. ప్రపంచ స్టార్ ప్లేయర్ లయనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు…బ్రెజిల్ కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

హాట్ ఫేవరెట్ బ్రెజిల్….

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, ప్రపంచ 3వ ర్యాంకర్ బ్రెజిల్…కోపా అమెరికా కప్ ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

2007 తర్వాత తొలిసారిగా ఫైనల్స్ చేరిన బ్రెజిల్…హాట్ ఫేవరెట్ గా ఫైనల్లో అడుగుపెడుతోంది.

గ్రూప్ లీగ్ దశలో పెరూను 5-0 గోల్స్ తో ఊదిపారేసిన ఆత్మవిశ్వాసంతో…సాంబా టీమ్ టైటిల్ సమరంలోనూ పాల్గోనుంది.

రియో నగరంలోని అతిపెద్ద సాకర్ స్టేడియం మర్కానాలో జరిగే టైటిల్ ఫైట్ కు 80వేల మంది అభిమానులు హాజరు కానున్నారు.

ప్రపంచ 3వ ర్యాంకర్ , హాట్ ఫేవరెట్ బ్రెజిల్ ధాటికి 21వ ర్యాంకర్ పెరూ ఏమాత్రం తట్టుకోగలదన్నది అనుమానమే.

First Published:  5 July 2019 1:58 PM IST
Next Story