ఆషాడం వచ్చి... ఆఫర్లకు బ్రేక్ వేసిందా !
జంపింగ్ జపాంగ్‌లకు కష్టం కాలం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల్లోకి జంప్ అవుదామని అనుకున్న జంపింగ్ నేతలకు బ్రేక్ పడింది. ఆషాడ మాసం రాకతో కొందరు నేతలు పార్టీ మార్పు ఆలోచనను పక్కనపెట్టేశారట. కాకినాడలో ఇటీవల సమావేశమైన కాపు నేతల్లో కొందరు బీజేపీలోకి వెళ్లాలని ప్లాన్ వేశారు. కానీ ఆషాడం మాసం రాకతో వారు తమ నిర్ణయాన్ని వాయిదావేశారట. తెలంగాణలో శనివారం అమిత్‌షా పర్యటన ఉంది. ఇక్కడ కొందరు నేతలు బీజేపీలోకి జంప్ కావాలని నిర్ణయించుకున్నారు. […]
జంపింగ్ జపాంగ్‌లకు కష్టం కాలం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల్లోకి జంప్ అవుదామని అనుకున్న జంపింగ్ నేతలకు బ్రేక్ పడింది. ఆషాడ మాసం రాకతో కొందరు నేతలు పార్టీ మార్పు ఆలోచనను పక్కనపెట్టేశారట.
కాకినాడలో ఇటీవల సమావేశమైన కాపు నేతల్లో కొందరు బీజేపీలోకి వెళ్లాలని ప్లాన్ వేశారు. కానీ ఆషాడం మాసం రాకతో వారు తమ నిర్ణయాన్ని వాయిదావేశారట.
తెలంగాణలో శనివారం అమిత్‌షా పర్యటన ఉంది. ఇక్కడ కొందరు నేతలు బీజేపీలోకి జంప్ కావాలని నిర్ణయించుకున్నారు. కానీ ముహూర్తం లేకపోవడంతో కొన్నాళ్లు ఆగేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
మరో మూడు నెలల పాటు ముహూర్తాలు లేవు. దీంతో కొంతమంది నేతలు మరికొంతకాలం వేచి ఉంటామని అధికార పార్టీ నేతలకు చెప్పారట. అయితే రేపటి పర్యటనలో మాత్రం అమిత్‌షాతో కలిసి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొంటారని చెబుతున్నారు.
ఇటు ఏపీలో కూడా వైసీపీలో చేరేందుకు కొంత మంది టీడీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. కానీ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ముందు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అధికార పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.
దీంతో ఆషాడ మాసం ఎఫెక్ట్ ఈ నేతలపై కూడా పడింది. మంచి ముహూర్తం చూసుకుని అధికార పార్టీలోకి జంప్ కావాలని తమ్ముళ్ల ఆలోచనగా తెలుస్తోంది.