ఇకపై తెలుగులోనూ సుప్రీం తీర్పులు
సుప్రీం కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పులను కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా ఏడు ప్రాంతీయ భాషల్లో కూడా వెలువరించాలని దాదాపు నిర్ణయించింది. ఇంగ్లీష్ నుంచి హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, ఒడియా, అస్సామీ భాషల్లోకి తీర్పును ట్రాన్స్‌లేట్ చేసి … వాటిని సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ఇందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆమోదం తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాప్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచే తీర్పులు ప్రాంతీయ భాషల్లో వెలువరించే […]
సుప్రీం కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పులను కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా ఏడు ప్రాంతీయ భాషల్లో కూడా వెలువరించాలని దాదాపు నిర్ణయించింది. ఇంగ్లీష్ నుంచి హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, ఒడియా, అస్సామీ భాషల్లోకి తీర్పును ట్రాన్స్‌లేట్ చేసి … వాటిని సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ఇందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆమోదం తెలిపారు.
ఇందుకోసం ప్రత్యేకంగా సాప్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచే తీర్పులు ప్రాంతీయ భాషల్లో వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే తీర్పు వెలువడిన రోజు ఇంగ్లీష్ కాపీ మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. వారం తర్వాత ఇతర భాషలకు సంబంధించిన కాపీలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
ప్రాంతీయ భాషల్లోనూ తీర్పులను ఉంచడం వల్ల కేసుకు సంబంధించిన వారికి సులువుగా అర్థమవుతుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లో ఉంచాలని 2017లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా న్యాయవ్యవస్థకు సూచించారు.