Telugu Global
National

గ్యాప్ పెరిగింది...

ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య గ్యాప్‌ పెరుగుతోంది. 2014 నుంచి 2019 మధ్యలో ఇద్దరి మధ్య ఉన్నంత సఖ్యత ఇప్పుడు లేదని టీఆర్‌ఎస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలిచిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసుకుని ఎదురెళ్లాలన్న భావనతో బీజేపీ పని చేస్తోంది. దీనికి ఊతమిచ్చేలా దేశ వ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీలో కేసీఆర్‌కు మోడీ స్థానం ఇవ్వలేదు. […]

గ్యాప్ పెరిగింది...
X

ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య గ్యాప్‌ పెరుగుతోంది. 2014 నుంచి 2019 మధ్యలో ఇద్దరి మధ్య ఉన్నంత సఖ్యత ఇప్పుడు లేదని టీఆర్‌ఎస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలిచిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసుకుని ఎదురెళ్లాలన్న భావనతో బీజేపీ పని చేస్తోంది.

దీనికి ఊతమిచ్చేలా దేశ వ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీలో కేసీఆర్‌కు మోడీ స్థానం ఇవ్వలేదు. దేశంలోనే తొలిసారిగా రైతులకు ఆర్థిక సాయం చేసే రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టడంతో పాటు, రైతు బీమా, రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి లక్ష్యాలను చేరుకోవడంతో దేశానికి కేసీఆర్‌ ఆదర్శంగా నిలిచారని.. అలాంటి ముఖ్యమంత్రికి రైతు సమస్యలపై ఏర్పాటైన హైపవర్ కమిటీలో చోటు ఇవ్వలేదంటే అది ముమ్మాటికి రాజకీయ కోణంలో జరిగిన తంతేనని టీఆర్‌ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవీస్ కన్వీనర్‌గా ఏర్పాటైన ఈ కమిటీలో కర్నాటక, హర్యానా, మధ్యప్రదేశ్‌, యూపీ, గుజరాత్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులకు స్థానం కల్పించారు మోడీ. తెలుగు రాష్ట్రాల సీఎంలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు.

కేసీఆర్‌కు తప్పకుండా ఈ కమిటీలో అవకాశం ఉంటుందని భావించారు. కానీ కేసీఆర్‌కు మోడీకి మధ్య పెరిగిన గ్యాప్ కారణంగానే తెలంగాణ సీఎంకు చోటు దక్కలేదంటున్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదగాలంటే కేసీఆర్‌తో స్నేహం వీడి ప్రత్యర్థి తరహాలోనే వ్యవహరించాలన్న భావనకు బీజేపీ వచ్చిందని టీఆర్‌ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.

First Published:  4 July 2019 9:15 AM IST
Next Story