బీజేపీ-వైసీపీ బంధంపై బాబు మళ్లీ యూటర్న్
ఓడినా చంద్రబాబు మారలేదు. అవే యూ టర్న్‌లు. అవే సత్యదూరమైన ప్రకటనలు కొనసాగిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ- బీజేపీ కలిసిపోయాయంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. మైనార్టీ ఓట్లను వైసీపీ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. కుప్పం పర్యటనలో ప్రసంగించిన చంద్రబాబునాయుడు… వైసీపీ- బీజేపీ ఎప్పటికీ కలిసే అవకాశమే ఉండదని ప్రకటించారు. అలా కలిస్తే వైసీపీ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని చంద్రబాబు వివరించారు. […]
ఓడినా చంద్రబాబు మారలేదు. అవే యూ టర్న్‌లు. అవే సత్యదూరమైన ప్రకటనలు కొనసాగిస్తున్నారు.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ- బీజేపీ కలిసిపోయాయంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. మైనార్టీ ఓట్లను వైసీపీ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.
కుప్పం పర్యటనలో ప్రసంగించిన చంద్రబాబునాయుడు… వైసీపీ- బీజేపీ ఎప్పటికీ కలిసే అవకాశమే ఉండదని ప్రకటించారు. అలా కలిస్తే వైసీపీ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని చంద్రబాబు వివరించారు.
కుప్పంలో కమ్మవాళ్లు ఎక్కువగా లేకున్నా తాను విజయం సాధించానని… అయినా సరే పార్టీపై, తనపై కులముద్ర వేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అయితే పలుమార్లు వైసీపీ- బీజేపీ కలిసిపోయాయని ప్రచారం చేసిన చంద్రబాబు… ఇప్పుడు మాత్రం వైసీపీ- బీజేపీ కలిసే అవకాశం ఎప్పటికీ ఉండదని వ్యాఖ్యానించడం ఆసక్తిగా ఉంది.