వైఎస్ వివేకా కేసు.... రంగయ్యకు నార్కో అనాలసిస్ పరీక్షలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ కోసం ఏర్పాటైన 24 మందితో కూడిన ప్రత్యేక బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. వాచ్‌మెన్ రంగయ్యను రెండు రోజులుగా దర్యాప్తు బృందం విచారించింది. అయితే రంగయ్య నోరు విప్పలేదు. విచారణకు సహకరించలేదు. దీంతో రంగయ్యకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. అందుకు కోర్టు అంగీకరించింది. రంగయ్య అంగీకారంతో నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు […]

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ కోసం ఏర్పాటైన 24 మందితో కూడిన ప్రత్యేక బృందం దర్యాప్తును వేగవంతం చేసింది.
వాచ్‌మెన్ రంగయ్యను రెండు రోజులుగా దర్యాప్తు బృందం విచారించింది. అయితే రంగయ్య నోరు విప్పలేదు. విచారణకు సహకరించలేదు. దీంతో రంగయ్యకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు.
అందుకు కోర్టు అంగీకరించింది. రంగయ్య అంగీకారంతో నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు ఓకే చెప్పింది. దీంతో వాచ్‌మెన్ రంగయ్యను పోలీసులు హైదరాబాద్ కు తరలించారు.
హైదరాబాద్‌లో రంగయ్యకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయనున్నారు. రంగయ్య నోరు విప్పితే కేసు చిక్కు ముడి వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.