Telugu Global
Cinema & Entertainment

యష్ ఫోన్ నెంబర్ ని... ఇలా సేవ్ చేసుకుందట!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కే జి ఎఫ్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. తన లుక్ తో ఇప్పటికే చాలామందిని మెప్పించాడు. మరి అతని భార్య రాధిక పండిట్… యష్ ఫోన్ నెంబర్  ను తన  ఫోన్లో ఎలా సేవ్ చేసుకుందో చూస్తే…. తన భర్త ఫిజిక్ గురించి ఏమనుకుంటుందో తెలుస్తోంది. యష్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘మొగ్గిన మనసు’ సినిమాతోనే రాధిక పండిత్ హీరోయిన్ […]

యష్ ఫోన్ నెంబర్ ని... ఇలా సేవ్ చేసుకుందట!
X

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కే జి ఎఫ్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే.

తన లుక్ తో ఇప్పటికే చాలామందిని మెప్పించాడు. మరి అతని భార్య రాధిక పండిట్… యష్ ఫోన్ నెంబర్ ను తన ఫోన్లో ఎలా సేవ్ చేసుకుందో చూస్తే…. తన భర్త ఫిజిక్ గురించి ఏమనుకుంటుందో తెలుస్తోంది.

యష్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘మొగ్గిన మనసు’ సినిమాతోనే రాధిక పండిత్ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా షూటింగ్ అప్పుడే రాధికా ను కలిసిన యష్…. ఆమెతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

త్వరలో రాధిక పండిట్ తమ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఒక రేడియో స్టేషన్ లో మాట్లాడుతూ తన భర్త పేరును ఫోన్ లో ఏమని సేవ్ చేసుకుందో రివీల్ చేసింది రాధిక పండిట్.

తమ మొదటి సినిమా అప్పటినుంచి యష్ ఫోన్ నెంబర్ తన ఫోన్లో ‘డొల్ల’ అని సేవ్ చేసి ఉంటుందని చెప్పింది రాధిక. డొల్ల అంటే ‘ఫ్యాట్’ అని అర్థం. కానీ కేజీఎఫ్ సినిమా కోసం యష్ కొంచెం బరువు పెరిగాడు కానీ ‘మొగ్గిన మనసు’ సినిమా సమయంలో మాత్రం అంత లావుగా ఏమి ఉండేవాడు కాదు. మరి రాధికా పండిట్ కు యష్ ను అలా ఎందుకు పిలవాలనిపించింది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

First Published:  3 July 2019 7:54 AM IST
Next Story