Telugu Global
Cinema & Entertainment

తమన్ స్థానంలో మణిశర్మ 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ సీనియర్ మ్యూజిక్ సంగీతదర్శకులలో మణిశర్మ పేరు ముందే ఉంటుంది. ఇప్పటికే చాలా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు మంచి సంగీతాన్ని అందించారు మణిశర్మ. తాజాగా మణిశర్మ ఒక యువ మ్యూజిక్ డైరెక్టర్ స్థానం రీప్లేస్ చేయనున్నారు. వాషింగ్టన్ డీసీ లో ఈ వారాంతంలో జరగాల్సిన తానా – 2019 అనే మ్యూజికల్ నైట్ జరగబోతోంది. ప్రస్తుతం వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఎస్.ఎస్.తమన్ ఈ మ్యూజికల్ నైట్ ని […]

తమన్ స్థానంలో మణిశర్మ 
X

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ సీనియర్ మ్యూజిక్ సంగీతదర్శకులలో మణిశర్మ పేరు ముందే ఉంటుంది. ఇప్పటికే చాలా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు మంచి సంగీతాన్ని అందించారు మణిశర్మ.

తాజాగా మణిశర్మ ఒక యువ మ్యూజిక్ డైరెక్టర్ స్థానం రీప్లేస్ చేయనున్నారు. వాషింగ్టన్ డీసీ లో ఈ వారాంతంలో జరగాల్సిన తానా – 2019 అనే మ్యూజికల్ నైట్ జరగబోతోంది. ప్రస్తుతం వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఎస్.ఎస్.తమన్ ఈ మ్యూజికల్ నైట్ ని ఆర్గనైజ్ చేయాల్సి ఉంది.

కానీ ఇప్పటికే బోలెడు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వలన తమన్ తప్పుకోగా తానా టీమ్ వారు మణిశర్మ ని రంగంలోకి దింపారు. ప్రముఖ సింగర్ లు సునీత, కౌసల్య, హేమచంద్ర, శ్రీ కృష్ణ తదితరులు మ్యూజికల్ నైట్ లో పాల్గొనబోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యూజికల్ నైట్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక సినిమాల పరంగా రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

First Published:  3 July 2019 3:51 AM IST
Next Story