Telugu Global
NEWS

మాకు ఓటు వేయకపోయినా... అర్హులందరికీ ఇళ్లు " సీఎం జగన్

“ఎన్నికల్లో మాకు ఓటు వేయకపోవచ్చు. మా పార్టీ వారు కాకపోవచ్చు. అయినా ఎన్నికలు ముగిసాయి. ఇక ఏ పార్టీ అని ఉండదు. ప్రజలందరూ ఒక్కటే. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు ఇవ్వాల్సిందే” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. మంగళవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రానున్న రోజుల్లో గృహ నిర్మాణాలు పారదర్శకంగా జరగాలని, లబ్దిదారులందరికీ ఇళ్లు ఇవ్వాలని ఆదేశించారు. […]

మాకు ఓటు వేయకపోయినా... అర్హులందరికీ ఇళ్లు  సీఎం జగన్
X

“ఎన్నికల్లో మాకు ఓటు వేయకపోవచ్చు. మా పార్టీ వారు కాకపోవచ్చు. అయినా ఎన్నికలు ముగిసాయి. ఇక ఏ పార్టీ అని ఉండదు. ప్రజలందరూ ఒక్కటే. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు ఇవ్వాల్సిందే” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి.

మంగళవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రానున్న రోజుల్లో గృహ నిర్మాణాలు పారదర్శకంగా జరగాలని, లబ్దిదారులందరికీ ఇళ్లు ఇవ్వాలని ఆదేశించారు.

న్నికల సమయంలోనే ప్రజలు ఆ పార్టీ, ఈపార్టీ అని చూడాలని, ఆ తర్వాత అందరూ ఒకటేనని అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ కార్యదర్శుల ద్వారా లబ్దిదారుల ఎంపిక జరగాలని, ఎంపికైన వారందరి పేర్లు సచివాలయంలో బోర్డులపై రాయాలని ముఖ్యమంత్రి సూచించారు.

“లబ్దిదారుల ఎంపికలో పక్షపాతం, అవినీతి ఉండకూడదు. అలా జరిగిందని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని సీఎం జగన్ హెచ్చరించారు. ప్రతి లబ్దిదారుడికి తనకు ఇచ్చిన భూమి ఎక్కడుందో తెలియాలని, పట్టా ఇచ్చి భూమి వెతుకులాడుకునే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రతీ గ్రామంలోనూ, పట్టణంలోనూ, నగరాల్లోనూ భూమి ఎంత ఉంది? ఇంకెంత కావాలి? అన్నది లెక్కలు తీయాలని, పేదలకు ఇచ్చేందుకు భూమి లేకపోతే ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి పట్టాలు చేసి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

“భూమి లేని చోట కొనుగోలు చేయండి. పట్టాలు వేయండి. రాళ్లు పాతి మహిళల పేర రిజిస్ట్ర్రేషన్ చేయండి. దానిని ఆధార్ కార్డుతో లింక్ చేసి మహిళలకు ఇవ్వండి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

ఇప్పుడు ప్లాట్ల ధరను అమాంతం పెంచేశారని, చదరపు అడుగు గతంలో 1100 రూపాయలుంటే దాన్ని 2300 రూపాయలు చేశారని, నిరుపేదలు ఈ డబ్బు ఎక్కడ నుంచి తీసుకువస్తారని సీఎం ప్రశ్నించారు.

అర్బన్ హోసింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు పూర్తి కాని చోట రివర్స్ టెండరింగ్ కు పిలవాలని ఆదేశించారు. “కాంట్రాక్టర్లను వేధించడం మా ఉద్దేశ్యం కాదు. పనుల్లో నాణ్యత తీసుకురావడమే మా లక్ష్యం” అని సిఎం జగన్ అన్నారు.

First Published:  3 July 2019 3:16 AM IST
Next Story