ఇప్పుడు సుమతీ శతకాలు వినరు బాబూ.... " విజయసాయి రెడ్డి
“అధికారంలో ఉండగా చేసిందంతా చేసి అధికారం కోల్పోయిన తర్వాత సుమతీ శతకాలు వల్లిస్తే ఎలా చంద్రబాబు నాయుడు గారూ” అంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పాలనలో ప్రజలను అన్ని విధాలుగా కష్టపెట్టిన చంద్రబాబు నాయుడు అండ్ కో ఇప్పుడు నీతి పలుకులు పలకడం విడ్డూరంగా ఉందని విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. గ్రామాల ప్రగతి కోసం గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ వాలంటీర్లను నియమిస్తుంటే చంద్రబాబు నాయుడికి […]
“అధికారంలో ఉండగా చేసిందంతా చేసి అధికారం కోల్పోయిన తర్వాత సుమతీ శతకాలు వల్లిస్తే ఎలా చంద్రబాబు నాయుడు గారూ” అంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పాలనలో ప్రజలను అన్ని విధాలుగా కష్టపెట్టిన చంద్రబాబు నాయుడు అండ్ కో ఇప్పుడు నీతి పలుకులు పలకడం విడ్డూరంగా ఉందని విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
గ్రామాల ప్రగతి కోసం గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ వాలంటీర్లను నియమిస్తుంటే చంద్రబాబు నాయుడికి ఆయన పెట్టిన జన్మభూమి కమిటీలు గుర్తుకు వస్తున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.
“మీ పాలనలో ఉన్న జన్మభూమి కమిటీలకు, మేం నియమిస్తున్న వాలంటీర్ల వ్యవస్థకు ఎంత తేడా ఉంటుందో త్వరలోనే మీకు తెలుస్తుంది. అంత వరకూ ఓపిక పట్టండి చంద్రబాబు గారూ” అని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసింది అని చెబుతున్న చంద్రబాబు నాయుడు ఆయన చేసిన పనులపై సమీక్షలు చేస్తూంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వివిధ పనులపై విచారణ జరపడం కక్ష సాధింపు చర్య ఎలా అవుతుందో తనకు తెలియడం లేదని, తాము నీతి నిజాయితీలకు మారు పేరు అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విజయసాయి రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూండడంతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలు పడుతున్నాయని ఆయన అన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చాలనుకోవడం అసాధ్యమని, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పులను ప్రజల ముందు అంగీకరించాలని అన్నారు.