55 ఏళ్ల తర్వాత పాక్ కు భారత టెన్నిస్ జట్టు
పాక్ గడ్డపై డేవిస్ కప్ ఫైట్ కు భారత్ రెడీ ఆసియా-ఓషియానా డేవిస్ కప్ సమరం ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నీ.. డేవిస్ కప్ లో పాక్ గడ్డపై జరిగే సమరంలో పాల్గొనటానికి భారతజట్టు…55 ఏళ్ల విరామం తర్వాత బయలుదేరి వెళుతోంది. ఆసియా-ఓషియానా జోన్ మ్యాచ్ లో పాకిస్థాన్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. అయితే… ఉగ్రవాద చర్యలు, ఆటగాళ్ల భద్రత కారణాలతో భారతజట్లు పాక్ పర్యటనకు విముఖత చూపుతూ వస్తున్నాయి. దీనికితోడు రెండు దేశాల క్రీడాసంబంధాలు సైతం అంతంత […]
- పాక్ గడ్డపై డేవిస్ కప్ ఫైట్ కు భారత్ రెడీ
- ఆసియా-ఓషియానా డేవిస్ కప్ సమరం
ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నీ.. డేవిస్ కప్ లో పాక్ గడ్డపై జరిగే సమరంలో పాల్గొనటానికి భారతజట్టు…55 ఏళ్ల విరామం తర్వాత బయలుదేరి వెళుతోంది. ఆసియా-ఓషియానా జోన్ మ్యాచ్ లో పాకిస్థాన్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
అయితే… ఉగ్రవాద చర్యలు, ఆటగాళ్ల భద్రత కారణాలతో భారతజట్లు పాక్ పర్యటనకు విముఖత చూపుతూ వస్తున్నాయి. దీనికితోడు రెండు దేశాల క్రీడాసంబంధాలు సైతం అంతంత మాత్రంగానే ఉంటూ వస్తున్నాయి.
పాకిస్థాన్ గడ్డపై భారత్ చివరిసారిగా…1964లో లాహోర్ వేదికగా జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ లోపాల్గొనడం విశేషం. 2006లో ముంబై వేదికగా ముగిసిన పోరులో భారత్, పాక్ జట్లు ఢీ కొన్నాయి.
భారత డేవిస్ కప్ జట్టు పాక్ లో జరిగే మ్యాచ్ లో పాల్గొనటానికి సమ్మతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తుదినిర్ణయం తీసుకోవాల్సింది భారత టెన్నిస్ సంఘమేనని తేల్చి చెప్పింది.
సెప్టెంబర్లో జరిగే ఈ డేవిస్ కప్ పోటీలో నెగ్గిన జట్టు ప్రపంచ గ్రూప్ క్వాలిఫైయర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది.