మీ ఐదుగురి పరుగులు కలిపినా అంబటి అంత స్కోర్ లేదు " ఎమ్మెస్కేపై గంభీర్ ఫైర్
అంబటి రాయుడు రిటైర్‌మెంట్‌కు దారి తీసిన పరిణామాలపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. సెలెక్టర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెలక్షన్‌కమిటీ వల్లే అంబటి రాయుడు హఠాత్తుగా రిటైర్‌మెంట్ ప్రకటించాల్సి వచ్చిందన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యుల తీరుతో మనస్థాపం చెందే అంబటి రాయుడు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని గంభీర్ అభిప్రాయపడ్డారు. సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, ఇతర నలుగురి సభ్యుల అర్హతలను కూడా పరోక్షంగా ప్రశ్నించారు. సెలక్షన్ కమిటీలోని ఐదుగురు సభ్యులు క్రికెట్‌లో చేసిన […]
అంబటి రాయుడు రిటైర్‌మెంట్‌కు దారి తీసిన పరిణామాలపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. సెలెక్టర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెలక్షన్‌కమిటీ వల్లే అంబటి రాయుడు హఠాత్తుగా రిటైర్‌మెంట్ ప్రకటించాల్సి వచ్చిందన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యుల తీరుతో మనస్థాపం చెందే అంబటి రాయుడు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారని గంభీర్ అభిప్రాయపడ్డారు.
సెలక్షన్ కమిటీలోని ఎమ్మెస్కే ప్రసాద్, ఇతర నలుగురి సభ్యుల అర్హతలను కూడా పరోక్షంగా ప్రశ్నించారు. సెలక్షన్ కమిటీలోని ఐదుగురు సభ్యులు క్రికెట్‌లో చేసిన పరుగులు కలిపినా రాయుడు తన కేరీర్‌లో సాధించిన స్కోర్ కంటే తక్కువేనని గంభీర్ ఎద్దేవా చేశారు. ప్రపంచ కప్‌లో సెలక్టర్ల తీరు తనను కూడా తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు. అంబటి రిటైర్‌మెంట్ కూడా సెలక్టర్ల వైఖరి వల్లే జరిగిందన్నారు.
”గాయాల కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్ల స్థానంలో రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు కానీ రాయుడికి మాత్రం చోటు కల్పించలేకపోయారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో రాయుడు బాగా ఆడాడు. దేశం కోసం చిత్తశుద్ధితో ఆడిన ఆటగాడు ఈవిధంగా రిటైర్ కావడం భారత క్రికెట్‌కు మంచిది కాదు” అని గంభీర్ అభిప్రాయపడ్డారు.