మళయాళంలోకి.... విజయేంద్రప్రసాద్ !
టాలీవుడ్ లోని ప్రముఖ రచయితల లో విజయేంద్రప్రసాద్ ఒకరు. దాదాపు రాజమౌళి సినిమాలన్నిటికీ కథలు అందించింది రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాదే. కేవలం తెలుగు లో మాత్రమే కాక విజయేంద్ర ప్రసాద్ కన్నడలో కూడా కొన్ని సినిమాలకు కథలు అందించారు. అంతేకాకుండా 2015 లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. తాజా సమాచారం ఈ మధ్యనే ‘మణికర్ణిక’ సినిమాకి కథా […]
టాలీవుడ్ లోని ప్రముఖ రచయితల లో విజయేంద్రప్రసాద్ ఒకరు. దాదాపు రాజమౌళి సినిమాలన్నిటికీ కథలు అందించింది రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాదే.
కేవలం తెలుగు లో మాత్రమే కాక విజయేంద్ర ప్రసాద్ కన్నడలో కూడా కొన్ని సినిమాలకు కథలు అందించారు. అంతేకాకుండా 2015 లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.
తాజా సమాచారం ఈ మధ్యనే ‘మణికర్ణిక’ సినిమాకి కథా రచయితగా పనిచేసిన విజయేంద్రప్రసాద్ ఇప్పుడు మళయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
మళయాళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఒక భారీ బడ్జెట్ మైతోలాజికల్ ఎపిక్ సినిమా కోసం స్క్రీన్ ప్లే రాస్తున్నట్లు సమాచారం అందుతోంది. విజీష్ మణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక ఈ సినిమాలో ఎవరు నటించనున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాకుండా విజయేంద్ర ప్రసాద్ తమిళంలో విజయ్ నటిస్తున్న ఒక సినిమాకి కూడా కథ అందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.