Telugu Global
CRIME

క్లాస్ పీకారని.... పెట్రోల్ చల్లి నిప్పు పెట్టిన ఇంటర్ స్టూడెంట్

నెల్లూరులో ఒక ఇంటర్ విద్యార్థి రెచ్చిపోయాడు. అమ్మాయిని వేధించవద్దు అని చెప్పినందుకు ఏకంగా ఇంటిలోకి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నెల్లూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి వంశీ తన క్లాస్‌మేట్ అయిన అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి తన స్నేహితురాలికి చెప్పి వాపోయింది. అమ్మాయి స్నేహితురాలు తన అమ్మమ్మకు ఈ విషయం చెప్పింది. దాంతో పెద్దావిడ కమలకుమారి… వంశీని పిలిచి అలా చేయవద్దని హెచ్చరించింది. దాంతో తనకే నీతులు చెబుతావా అని కక్ష పెంచుకున్న […]

క్లాస్ పీకారని.... పెట్రోల్ చల్లి నిప్పు పెట్టిన ఇంటర్ స్టూడెంట్
X

నెల్లూరులో ఒక ఇంటర్ విద్యార్థి రెచ్చిపోయాడు. అమ్మాయిని వేధించవద్దు అని చెప్పినందుకు ఏకంగా ఇంటిలోకి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

నెల్లూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి వంశీ తన క్లాస్‌మేట్ అయిన అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి తన స్నేహితురాలికి చెప్పి వాపోయింది.

అమ్మాయి స్నేహితురాలు తన అమ్మమ్మకు ఈ విషయం చెప్పింది. దాంతో పెద్దావిడ కమలకుమారి… వంశీని పిలిచి అలా చేయవద్దని హెచ్చరించింది. దాంతో తనకే నీతులు చెబుతావా అని కక్ష పెంచుకున్న వంశీ… వారం క్రితం కమలకుమారి ఇంటిలోకి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.

దాంతో ఇంట్లో ఫర్నీచర్ మొత్తం కాలిపోయింది. ఆ సమయంలో పై అంతస్తులో నిద్రించిన కుటుంబసభ్యులు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు.

కానీ ఆ తర్వాత అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా… వంశీ పెట్రోల్ సీసాతో వచ్చి నిప్పు పెట్టిన దృశ్యాలు కనిపించాయి. వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు.

First Published:  2 July 2019 7:00 AM IST
Next Story