Telugu Global
National

పోలవరం ఆపేయాలంటూ మోడీకి లేఖ

ఏపీ ప్రజల జీవనాడిగా పిలవబడుతున్న పోలంవరం ప్రాజెక్టును వెంటనే ఆపేయాని కోరుతూ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. గతంలో చాలా సార్లు ఆయన ఒడిషా ప్రయోజనాల మేరకు అంటూ ప్రధానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత వారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ భేటీ అయ్యారు. అప్పుడే పోలవరం పనులు ఆపొద్దని.. […]

పోలవరం ఆపేయాలంటూ మోడీకి లేఖ
X

ఏపీ ప్రజల జీవనాడిగా పిలవబడుతున్న పోలంవరం ప్రాజెక్టును వెంటనే ఆపేయాని కోరుతూ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

గతంలో చాలా సార్లు ఆయన ఒడిషా ప్రయోజనాల మేరకు అంటూ ప్రధానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

గత వారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ భేటీ అయ్యారు. అప్పుడే పోలవరం పనులు ఆపొద్దని.. స్టాప్ వర్క్ ఆదేశాలు జారీ చేయాలని వెంకయ్య.. మంత్రిని కోరారు. దానికి జవదేకర్ స్పందిస్తూ.. పోలవరానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. ప్రతీ ఏడాదీ అనుమతులను రెన్యూవల్ చేస్తున్నామని కూడా వివరించారు.

ఈ నేపథ్యంలోనే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీకి లేఖ రాస్తూ పర్యవరణ శాఖా మంత్రిని ఉఠంకించడం చర్చకు దారి తీసింది. తాము ఎన్నిసార్లు పోలవరం ఆపమని కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాసినా స్పందించట్లేదని నవీన్ పట్నాయక్ ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతే కాకుండా ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతుందని ఆయన చెప్పారు. ఆదివాసీలు, గిరిజనులు ఆ ప్రాంతంలో నివసిస్తారని.. వారు ఈ ప్రాజెక్టు వల్ల తీవ్రంగా నష్టపోతారని లేఖలో పేర్కొన్నారు.

అయితే.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మల్కన్‌గిరి జిల్లాలోని ముంపు ప్రాంతానికి అవసరమైన కరకట్ట కడతామని హామీ ఇచ్చింది.

First Published:  2 July 2019 3:36 PM IST
Next Story