Telugu Global
CRIME

మాయ మాటలతో వంచన.... ఆపై అశ్లీల వీడియోలు.... వాట్సప్‌లో వైరల్ !

యువతులు, మహిళలను మాయమాటలతో వంచించి వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో అశ్లీల వీడియోలు తీశాడు ఒకడు. ఆ వీడియోలను చోరీ చేసి స్నేహితులకు పంపాడు మరొకడు. ఆ వీడియోలన్నీ సేకరించి అసలు వ్యక్తితో బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డాడు మరొకడు. ఇలా కొందరు దుష్టుల చర్యలతో యువతులు మానసిక క్షోభ అనుభవించారు. చివరికి ఒక యువతి ధైర్యం చేయడంతో విషయం పోలీసులకు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు […]

మాయ మాటలతో వంచన.... ఆపై అశ్లీల వీడియోలు.... వాట్సప్‌లో వైరల్ !
X

యువతులు, మహిళలను మాయమాటలతో వంచించి వారితో ఏకాంతంగా గడిపిన సమయంలో అశ్లీల వీడియోలు తీశాడు ఒకడు. ఆ వీడియోలను చోరీ చేసి స్నేహితులకు పంపాడు మరొకడు. ఆ వీడియోలన్నీ సేకరించి అసలు వ్యక్తితో బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డాడు మరొకడు. ఇలా కొందరు దుష్టుల చర్యలతో యువతులు మానసిక క్షోభ అనుభవించారు. చివరికి ఒక యువతి ధైర్యం చేయడంతో విషయం పోలీసులకు తెలిసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే….

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు సెల్‌ఫోన్ రిపేరింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. తన దగ్గరకు వచ్చే యువతులు, మహిళలతో సాన్నిహిత్యం పెంచుకొని వారిని మాయమాటలతో వంచించి ఏకాంతంగా గడిపేవాడు. అదే సమయంలో వీడియోలు కూడా తీసేవాడు. వీటన్నింటినీ తన దుకాణంలోని కంప్యూటర్లో సేవ్ చేసుకునేవాడు.

అయితే తన దుకాణంలో మరో యువకుడు పని చేస్తున్నాడు. అతను ఈ విషయం తెలుసుకొని వీడియోల డేటా చోరీ చేశాడు. అనంతరం వాటిని అదే గ్రామంలోని తన స్నేహితులు, సన్నిహితులకు పంపాడు. కాగా, వీటన్నింటినీ ఒక వ్యక్తి సేకరించి పెట్టుకొని అసలు బాధ్యుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తనకు ఇంత మొత్తం కావాలని లేకపోతే బయటపెడతానని భయపెట్టాడు.

కాని అసలు బాధ్యుడు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఆ వ్యక్తి వీడియోల్లో కొన్నింటిని వాట్సప్‌లో పెట్టాడు. ఇవి చూసిన బాధిత యువతుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించారు. మొగల్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేసి బాధ్యుడైన వ్యక్తితో పాటు డేటా చోరీ చేసిన యువకుడిని కూడా అదుపులోనికి తీసుకున్నారు.

అయితే అసలు నిందితుడిని బెదిరించిన వ్యక్తిని మాత్రం అరెస్టు చేయలేదు. అతనికి కొంత మంది రాజకీయనాయకుల అండదండలు ఉండటంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

First Published:  2 July 2019 6:55 AM IST
Next Story