లింగమనేని భవనం ఎవరిదంటే ?
చంద్రబాబు ఉంటున్న ఇంటికి యజమాని ఎవరో అంతుచిక్కడం లేదు. ఆ ఇంటికి తానే ఓనర్ అని ధైర్యంగా ఎవరూ చెప్పుకునే సాహసం చేయలేకపోతున్నారు. ల్యాండ్ పూలింగ్ నుంచి లింగమనేని ఎస్టేట్ భూములను మినహాయించినందుకు గాను… కృతజ్ఞతగా ఇంటిని చంద్రబాబుకి లింగమనేని కట్టబెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉన్నట్టుగానే కనిపిస్తున్నా… దాన్ని అధికారికంగా నిర్ధారించుకుని ఇంటిని తనది చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు చంద్రబాబుకు లేకుండాపోయింది. ఇందుకు మూడేళ్ల క్రితం చంద్రబాబు, లింగమనేని రమేష్ చేసిన […]
చంద్రబాబు ఉంటున్న ఇంటికి యజమాని ఎవరో అంతుచిక్కడం లేదు. ఆ ఇంటికి తానే ఓనర్ అని ధైర్యంగా ఎవరూ చెప్పుకునే సాహసం చేయలేకపోతున్నారు.
ల్యాండ్ పూలింగ్ నుంచి లింగమనేని ఎస్టేట్ భూములను మినహాయించినందుకు గాను… కృతజ్ఞతగా ఇంటిని చంద్రబాబుకి లింగమనేని కట్టబెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉన్నట్టుగానే కనిపిస్తున్నా… దాన్ని అధికారికంగా నిర్ధారించుకుని ఇంటిని తనది చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు చంద్రబాబుకు లేకుండాపోయింది.
ఇందుకు మూడేళ్ల క్రితం చంద్రబాబు, లింగమనేని రమేష్ చేసిన ప్రకటనలే కారణం. అక్రమంగా నిర్మించిన లింగమనేని భవనంలో మీరెలా ఉంటున్నారని ప్రశ్నించగా… అది ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా స్వాధీనం చేసుకున్నామని అసెంబ్లీ వేదికగా మూడేళ్ల క్రితం చంద్రబాబు స్వయంగా చెప్పారు.
అదే సమయంలో లింగమనేని రమేష్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను నిర్మించిన ఇంటిని ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చేశాని… దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ భవనాన్ని ప్రభుత్వం ఏం చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.
అటు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు… ఇంటి నిర్మాణం చేసిన రమేష్…. ఇద్దరూ కూడా భవనం ప్రభుత్వానిదే అని మూడేళ్ల క్రితమే ధృవీకరించారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు చంద్రబాబు…. లింగమనేని భవనంలో ఇంతకాలం తాను అద్దెకు ఉన్నానని బుకాయిస్తున్నారు.
మూడేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా లింగమనేని భవనాన్ని ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వం తీసుకుందని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఎక్కడ ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటో అని అద్దెభవనం అంటూ మాట్లాడుతున్నారు.
అయితే ఇప్పటి వరకు అద్దెకు ఇచ్చిన లింగమనేని రమేష్ మాత్రం స్పందించలేదు. లింగమనేని రమేష్ మూడేళ్ల క్రితం మీడియా కెమెరాల సాక్షిగా భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పారు కాబట్టి…. ఆయన ఆ ఇల్లు తనదేనని నోటీసులకు స్పందించే అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం ధైర్యంగా వ్యవహరిస్తే లింగమనేని భవనం ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది.