Telugu Global
NEWS

ఆటలు... కోట్లకు బాటలు!

క్రీడలు కూటికా గుడ్డకా అనుకొనే రోజులు పోయాయి. క్రీడలే జీవితంగా చేసుకొంటే వందల కోట్ల సంపాదనతో కుబేరులు కావచ్చని నిన్నటి తరం సచిన్ టెండుల్కర్ నుంచి నేటి తరం విరాట్ కొహ్లీ వరకూ చాటిచెబుతున్నారు. ఫుట్ బాల్, టెన్నిస్, క్రికెట్… ఆటలు ఏవైనా ప్రపంచ స్థాయిలో రాణించగలిగితే రెండుచేతులా ఆర్జించటమే కాదు…వద్దంటే డబ్బేనని చెప్పక తప్పదు. ఆర్జన, సంపాదన అన్న పదాలకు మానవజీవితంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది. రాజకీయాలు, వ్యాపారం, ఉద్యోగాల ద్వారా మాత్రమే కాదు… ఆటలను వృత్తిగా చేసుకొంటే కోట్లకు […]

ఆటలు... కోట్లకు బాటలు!
X

క్రీడలు కూటికా గుడ్డకా అనుకొనే రోజులు పోయాయి. క్రీడలే జీవితంగా చేసుకొంటే వందల కోట్ల సంపాదనతో కుబేరులు కావచ్చని నిన్నటి తరం సచిన్ టెండుల్కర్ నుంచి నేటి తరం విరాట్ కొహ్లీ వరకూ చాటిచెబుతున్నారు.

ఫుట్ బాల్, టెన్నిస్, క్రికెట్… ఆటలు ఏవైనా ప్రపంచ స్థాయిలో రాణించగలిగితే రెండుచేతులా ఆర్జించటమే కాదు…వద్దంటే డబ్బేనని చెప్పక తప్పదు.

ఆర్జన, సంపాదన అన్న పదాలకు మానవజీవితంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది. రాజకీయాలు, వ్యాపారం, ఉద్యోగాల ద్వారా మాత్రమే కాదు… ఆటలను వృత్తిగా చేసుకొంటే కోట్లకు పడగలెత్తవచ్చునని సాకర్ సూపర్ స్టార్లు లయనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, బాక్సర్ ఫ్లాయిడ్ మే వెదర్, బాస్కెట్ బాల్, టెన్నిస్, గోల్ఫ్, క్రికెట్ స్టార్లు సైతం చాటిచెబుతున్నారు.

నాడు సచిన్…. నేడు ధోనీ, కొహ్లీ….

మనదేశంలో క్రికెట్టే మతం. క్రికెటర్లుగా పేరు ప్రఖ్యాతులు మాత్రమే కాదు…వందల కోట్ల రూపాయలు ఆర్జించవచ్చునని మాస్టర్ సచిన్ టెండుల్కర్ నిరూపించాడు. తన 24 ఏళ్ల క్రికెట్ జీవితంలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ సైతం వెయ్యి కోట్ల రూపాయల లక్ష్యానికి చేరువగా దూసుకుపోతున్నాడు.

అయితే…ప్రస్తుత భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ విరాట్ కొహ్లీ సైతం ఇబ్బడిముబ్బడిగా ఆర్జిస్తున్నాడు. ఏడాదికి 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకూ సంపాదిస్తూ…క్రీడా కుబేరుల జాబితాలో చేరిపోయాడు.

ఫోర్బెస్ జాబితాలో కొహ్లీ…

ప్రపంచంలో వివిధ క్రీడల ద్వారా అత్యధికంగా ఆర్జించే క్రీడాకారుల జాబితాను…ఫోర్బెస్ సంస్థ ఏటా ప్రకటిస్తూ వస్తోంది. 2019 మొదటి వందమంది అత్యధిక ఆర్జనపరులైన క్రీడాకారుల జాబితాలో భారత్ నుంచి విరాట్ కొహ్లీ మాత్రమే ఒకే ఒక్కడుగా నిలిచాడు.

మొదటి వందమంది జాబితాలో …వరుసగా మూడో ఏడాది సైతం తన స్థానాన్ని నిలుపుకొన్నాడు. 2017లో 89, 2018 సీజన్లో 83వ స్థానాలలో నిలిచిన కొహ్లీ..2019 సీజన్లో మాత్రం…సంపాదన బాగా పెరిగినా…ర్యాంకుల పరంగా 100వ స్థానానికి పడిపోయాడు.

25మిలియన్ డాలర్ల ఆర్జనతో కొహ్లీ….

2018 జూన్ నుంచి 2019 జూన్ వరకూ గల 12 నెలల కాలం సంపాదనలో ప్రపంచ మొదటి 100 మంది క్రీడాకారులలో విరాట్ కొహ్లీ వందవస్థానంలో నిలిచాడు.

ఫోర్బ్స్ మ్యాగజీన్.. వెలువరించిన క్రీడాకుబేరుల జాబితాలో విరాట్ కొహ్లీ ఏడాదికి 170 కోట్ల 28 కోట్ల రూపాయలు మాత్రమే ఉండటం విశేషం. మిగిలిన 21 మిలియన్ డాలర్లు..కేవలం ఎండార్స్ మెంట్ల ద్వారానే కొహ్లీ సంపాదించాడు.

అగ్రస్థానంలో లయనల్ మెస్సీ…

2019 సంవత్సరానికి ఫోర్బ్స్ వెలువరించిన మొత్తం 100 మంది అత్యధిక సంపాదనపరులైన క్రీడాకారుల జాబితాలో…. అర్జెంటీనా సాకర్ దిగ్గజం లయనల్ మెస్సీ 127 మిలియన్ డాలర్ల ఆర్జనతో అగ్రస్థానంలో నిలిచాడు.

రెండోర్యాంక్ లో రొనాల్డో…

పోర్చుగీస్ కమ్ రియల్ మాడ్రిడ్ సూపర్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో 109 మిలియన్ డాలర్ల ఆర్జనతో రెండో ర్యాంక్ లో ఉన్నాడు.

భారత క్రీడాచరిత్రలో సచిన్, ధోనీ,కొహ్లీ మాత్రమే ఫోర్బ్స్ క్రీడాసంపాదన జాబితాలో చోటు సాధించగలిగారు.

2013 ఫోర్బ్స్ క్రీడాసంపాదన జాబితాలో ధోనీ 13, సచిన్ 51వ ర్యాంకులు సాధించగా…2010 జాబితాలో సచిన్, ధోనీ, కొహ్లీ ముగ్గురూ చోటు సంపాదించారు.

టెన్నిస్ లోనూ డబ్బే డబ్బు…

టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో సైతం విజేతలకు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్, అమెరికన్ ఓపెన్ విజేతలకు సైతం 18 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకూ ప్రైజ్ మనీగా ఇస్తున్నారు.

ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్, ఫ్రెంచ్ ఓపెన్ స్టార్ రాఫెల్ నడాల్, గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్, అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ టెన్నిస్ క్రీడనే జీవితంగా చేసుకొని క్రీడాకుబేరులుగా మారినవారే.

సూపర్ గోల్ఫర్ టైగర్ వుడ్స్, బాక్సర్ ఫ్లాయిట్ మే వెదర్ , బాస్కెట్ బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్, కెవిన్ డ్యురాంట్, స్టీఫెన్ కర్రీ లాంటి క్రీడాకారులు…. ఇప్పటికే వందలకోట్ల డాలర్లు ఆర్జించి… .క్రీడాకారుల సంపాదనలో సరికొత్త చరిత్ర సృష్టించినవారే.

క్రీడలే జీవితంగా, వృత్తిగా భావిస్తే కష్టానికి వందరెట్లను మించిన ఫలితం ఉంటుందనటానికి నిదర్శనమే నేటితరం సూపర్ స్టార్ క్రీడాకారులు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  2 July 2019 7:55 AM IST
Next Story