మల్లేశం కి కోపం వచ్చిందా?.... ఆసక్తి రేపుతున్న ప్రియదర్శి ట్వీట్
ఇటీవలే తెలుగు సినిమా పరిశ్రమ లో బయోపిక్ ల హవా నడుస్తున్న నేపథ్యం లో మల్లేశం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కమెడియన్ ప్రియదర్శి. హీరో కి ఫ్రెండ్ రోల్స్ చేస్తూ వచ్చిన ప్రియదర్శి కి ఈ సినిమా హీరో గా మొదటి సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ సినిమా… కొత్త నటులు, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతను పరిచయం చేస్తూ చేసిన సినిమా ఇది. ఈ సినిమా కి రాజ్ […]
ఇటీవలే తెలుగు సినిమా పరిశ్రమ లో బయోపిక్ ల హవా నడుస్తున్న నేపథ్యం లో మల్లేశం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కమెడియన్ ప్రియదర్శి. హీరో కి ఫ్రెండ్ రోల్స్ చేస్తూ వచ్చిన ప్రియదర్శి కి ఈ సినిమా హీరో గా మొదటి సినిమా.
సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ సినిమా… కొత్త నటులు, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతను పరిచయం చేస్తూ చేసిన సినిమా ఇది.
ఈ సినిమా కి రాజ్ ఆర్ దర్శకుడి గా పని చేశారు. ఈ సినిమా కి విడుదలకి ముందే అనేక పబ్లిక్ స్క్రీన్స్ లో వేశారు. సినిమా కి రిలీజ్ కి ముందే మంచి పేరు వచ్చింది. విడుదల అయ్యాక విమర్శకుల నుండి కూడా మంచి సమీక్షలు వచ్చాయి…. కానీ సినిమా కి మాత్రం జనాలు థియేటర్స్ కు ఎక్కువగా రాలేదు. సినిమా కలెక్షన్స్ బాగా పడిపోయాయి.
ఈ విషయం మీద నిరుత్సాహపడిన సినిమా హీరో ప్రియదర్శి ఒక ఆసక్తికర ట్వీట్ వేసాడు. “సినిమా కి కంటెంట్ కింగ్ కావచ్చు…. కానీ డిస్ట్రిబ్యూషన్ దేవుడు లాంటిది” అనే అర్ధం తో ట్వీట్ చేసిన ప్రియాదర్శి తన సినిమా పంపిణీ విషయం లో నిరుత్సాహపడుతున్నాడు అనే విషయం అర్ధం అవుతుంది.
Content is King. But, Distribution is God. Period.
— Mallesham (@priyadarshi_i) June 30, 2019