కత్తిరింపులు మొదలు పెట్టిన లోకేష్
నారా లోకేష్ ఎన్నికల తర్వాత జూలు విదిల్చారు. అయితే అది ట్విట్టర్లోనే. సొంతంగా ట్వీట్లు పెడుతున్నారో లేక సిబ్బందిని అందుకు నియమించుకున్నారో గానీ… వరుసగా వైసీపీపై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు లోకేష్. సాధారణ నెటిజన్ల తరహాలోనే చిన్నచిన్న అంశాలు కూడా లోకేష్ ట్విట్టర్లో కనిపిస్తున్నాయి. అయితే లోకేష్ ఇలా ట్వీట్లు పెట్టగానే నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ఎదురుదాడి వస్తోంది. ముఖ్యంగా వైసీపీ సానుభూతిపరులు లోకేష్ కు కౌంటర్‌గా కామెంట్లు పెడుతున్నారు. చూస్తుంటే అసలు లోకేష్ ట్విట్టర్ ఖాతాను ఫాలో […]
నారా లోకేష్ ఎన్నికల తర్వాత జూలు విదిల్చారు. అయితే అది ట్విట్టర్లోనే. సొంతంగా ట్వీట్లు పెడుతున్నారో లేక సిబ్బందిని అందుకు నియమించుకున్నారో గానీ… వరుసగా వైసీపీపై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు లోకేష్.
సాధారణ నెటిజన్ల తరహాలోనే చిన్నచిన్న అంశాలు కూడా లోకేష్ ట్విట్టర్లో కనిపిస్తున్నాయి. అయితే లోకేష్ ఇలా ట్వీట్లు పెట్టగానే నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ఎదురుదాడి వస్తోంది. ముఖ్యంగా వైసీపీ సానుభూతిపరులు లోకేష్ కు కౌంటర్‌గా కామెంట్లు పెడుతున్నారు.
చూస్తుంటే అసలు లోకేష్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్నది టీడీపీ వాళ్లా లేక వైసీపీ వారా అన్న అనుమానం వచ్చే స్థాయిలో లోకేష్ ట్వీట్లకు కౌంటర్‌గా కామెంట్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ రూట్ మార్చారు.
తన ట్వీట్లకు కౌంటర్‌గా, వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టేవారిని బ్లాక్ చేసేస్తున్నారు. ఇలా వందలాది మంది వైసీపీ నెటిజన్లను లోకేష్ బ్లాక్ చేసేశారు.
లోకేష్ తమకు సమాధానం చెప్పలేక ఇలా బ్లాక్ చేసుకుని పారిపోతున్నారంటూ వైసీపీ నెటిజన్లు తిరిగి ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.