Telugu Global
NEWS

శాసనసభ కేసీఆర్ సొంత ఆస్తా? " మల్లు భట్టివిక్రమార్క

“తెలంగాణ శాసనసభ, సచివాలయం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత ఆస్తా. లేక ఆయన జాగీరా? ” అని శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ నేత ముల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణలో నూతనంగా సచివాలయం, శాసనసభ భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం ఆయా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. సోమవారం ఉదయం సచివాలయంలోని కొన్ని భవంతులను […]

శాసనసభ కేసీఆర్ సొంత ఆస్తా?  మల్లు భట్టివిక్రమార్క
X

“తెలంగాణ శాసనసభ, సచివాలయం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత ఆస్తా. లేక ఆయన జాగీరా? ” అని శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ నేత ముల్లు భట్టివిక్రమార్క అన్నారు.

తెలంగాణలో నూతనంగా సచివాలయం, శాసనసభ భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం ఆయా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

సోమవారం ఉదయం సచివాలయంలోని కొన్ని భవంతులను కూల్చే పనిని ప్రారంభించాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. ఈ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు సచివాలయానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ముందుగా శాసనసభకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. వీరందరినీ శాసనసభ ప్రాంగణంలోకి రాకుండా నిలువరించారు.

పోలీసుల చర్యతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రిపై ఫేర్ అయ్యారు.

శాసనసభ దేవాలయం వంటిదని, ఇది కేసీఆర్ దో లేక ఆయన కుటుంబానికి చెందిన ఆస్తో కాదు అని అన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో గెలిచిన వారు సచివాలయాన్ని, శాసనసభను కూల్చేసి తిరిగి కడతామంటే ఎలా అని ప్రశ్నించారు.

“తెలంగాణ శాసనసభలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్కరే ఉన్నారనుకుంటున్నారా? శాసనసభ, సచివాలయం ఆయన సొంత ఆస్తిగా భావిస్తున్నారా? “అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, తనకు నచ్చిన విధంగా ముఖ్యమంత్రి ప్రవర్తించడం దారుణమని అన్నారు.

మల్లు భట్టివిక్రమార్కతో పాటు శాసనసభ, సచివాలయాలను సందర్శించిన వారిలో లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి సభ్యుడు జీవన్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు ఉన్నారు.

First Published:  1 July 2019 6:46 AM IST
Next Story