Telugu Global
National

లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా మిథున్ రెడ్డి

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అరుదైన గౌరవం దక్కింది. లోక్ సభలో ఆ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డికి లోక్ సభ ప్యానెల్ స్పీకర్ పదవి దక్కింది. సోమవారం సాయంత్రం లోక్ సభ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి దక్కిన గౌరవంగా పార్టీ నాయకులు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై […]

లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా మిథున్ రెడ్డి
X

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అరుదైన గౌరవం దక్కింది. లోక్ సభలో ఆ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డికి లోక్ సభ ప్యానెల్ స్పీకర్ పదవి దక్కింది.

సోమవారం సాయంత్రం లోక్ సభ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి దక్కిన గౌరవంగా పార్టీ నాయకులు భావిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఇలాంటిదేమీ లేదని ఆయన స్వయంగా ప్రకటించారు.

డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని తెలుగుదేశం నాయకులు అప్పట్లో విమర్శలు కూడా చేశారు. వీటికి తెర దించుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ స్పీకర్ పదవిపై తమను ఎవరూ సంప్రదించలేదని, అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని ప్రకటించారు.

అయితే, తాజాగా లోక్ సభలో ప్యానెల్ స్పీకర్ పదవికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డిని ఎంపిక చేయడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోంది.

ఈ అరుదైన పదవి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కడంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలలో మేలు జరుగుతుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఇంతకు ముందు లోక్ సభ స్పీకర్ గా జీ.ఎం.సీ.బాలయోగి వ్యవహరించారు.

ఆయన తర్వాత చాలా కాలానికి భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్ర్రతిగా, రాజ్యసభ చైర్మన్ గా ఉన్నారు.

ఇప్పుడు మిథున్ రెడ్డికి ప్యానెల్ స్పీకర్ పదవి దక్కడంతో ఆ పార్టీ నాయకులే కాదు…. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తనకు వచ్చిన ఈ ప్యానెల్ స్పీకర్ పదవిని ఓ బాధ్యతగా స్వీకరిస్తానని మిథున్ రెడ్డి తెలిపారు.

First Published:  1 July 2019 11:07 AM GMT
Next Story