Telugu Global
NEWS

లింగమనేని ఎక్కడ ?

లింగమనేని రమేష్. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న పేరు ఇది. క్రిష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ప్రభుత్వం… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అద్దెకు తీసుకున్న ఇల్లు కూడా అక్రమ నిర్మాణమేనని తేల్చింది. దీంతో ఈ కట్టడం కూల్చివేస్తామని, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలంటూ ప్రభుత్వం ఆ ఇంటికి నోటీసు కూడా అంటించింది. ఈ ఇంట్లో ఉంటున్నది సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ఇల్లు అద్దెకు తీసుకుని గడచిన […]

లింగమనేని ఎక్కడ ?
X

లింగమనేని రమేష్. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న పేరు ఇది. క్రిష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ప్రభుత్వం… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అద్దెకు తీసుకున్న ఇల్లు కూడా అక్రమ నిర్మాణమేనని తేల్చింది.

దీంతో ఈ కట్టడం కూల్చివేస్తామని, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలంటూ ప్రభుత్వం ఆ ఇంటికి నోటీసు కూడా అంటించింది. ఈ ఇంట్లో ఉంటున్నది సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ఇల్లు అద్దెకు తీసుకుని గడచిన ఐదు సంవత్సరాలుగా ఆయన అక్కడే ఉంటున్నారు.

అక్రమ కట్టడం నిర్మించిన లింగమనేని రమేష్ ఇంటికి ప్రభుత్వం నోటీసు అంటిస్తే అది తమకే ఇచ్చినట్లుగా తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఇల్లు అద్దెకు తీసుకున్న వారికి అది అక్రమమో… సక్రమమో తేలాల్సిన అవసరం లేదని, అది అక్రమమని తేలితే అద్దెకున్నవారు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోవచ్చునని రాజకీయ నేతలతో పాటు సామాన్యులు కూడా అంటున్నారు.

అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం తమ నాయకుడు అద్దెకు తీసుకున్న ఇంటికి నోటీసు ఇస్తారా? అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇంటిని అద్దెకు తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారే తప్ప ఇంటి యజమాని ఎక్కడా కనిపించడం లేదని…. తన ఇల్లు అక్రమమో, సక్రమమో కూడా చెప్పేందుకు ఆయన ముందుకు రాకపోవడం ఏమిటని ప్రశ్నలు వస్తున్నాయి.

“అసలు ఈ లింగమనేని ఎక్కడ ఉన్నారు లింగేశ్వరా?” అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు ఇక్కడే ఉండాలంటూ శనివారం నాడు రైతుల ముసుగులో ఉన్న కొందరు తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబును కోరినట్లుగా వార్తలు వస్తే…. మీరు ఇక్కడ ఎలా ఉంటారంటారంటూ మరికొందరు ఆదివారం నాడు చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఆందోళన చేశారు.

ఇంత జరుగుతున్నా ఇంటి యజమాని లింగమనేని రమేష్ మాత్రం ఎక్కడున్నారో… ఏం చేస్తున్నారో మాత్రం వెలుగులోకి రాలేదు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం సమాచారాన్ని కొట్టేసి తమ వద్ద నిక్షిప్తం చేసుకున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ యజమాని కూడా ఇలాగే బయటకు రాలేదని, ఇప్పుడు లింగమనేని కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నాడని అంటున్నారు.

తన ఇంటికి నోటీసులు అంటించి…. వాటికి స్పందించకపోతే కూలగొట్టేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించినా చంద్రబాబు నాయుడికి ఇల్లు అద్దెకు ఇచ్చిన లింగమనేని రమేష్ మాత్రం ఇప్పటి వరకూ వెలుగులోకి రాకపోవడం మిస్టరీగానే ఉందని అంటున్నారు.

First Published:  1 July 2019 2:59 AM IST
Next Story