రైతులను ముంచిన బాబు ప్రభుత్వం " మంత్రి కన్నబాబు
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళల్లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని, వారిని అన్ని విధాలుగా నాశనం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర్రంలో వ్యవసాయ పరిస్థితిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి కురసాల కన్నబాబు అనంతరం విలేకరులతో మాట్లాడారు. “రాష్ట్ర్రంలో వ్యవసాయాన్ని దండగమారిగా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే. ఆయన చేసిన అవినీతి, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన […]
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళల్లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని, వారిని అన్ని విధాలుగా నాశనం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
రాష్ట్ర్రంలో వ్యవసాయ పరిస్థితిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి కురసాల కన్నబాబు అనంతరం విలేకరులతో మాట్లాడారు. “రాష్ట్ర్రంలో వ్యవసాయాన్ని దండగమారిగా చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే. ఆయన చేసిన అవినీతి, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరుపై ఆధారాలతో సహా నిరూపిస్తాం ” అని కన్నబాబు స్పష్టం చేశారు.
రైతులకు సరఫరా చేసేందుకు విత్తనాలు కావాలని, వాటిని కొనుగోలు చేసేందుకు నిధులు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ అధికారులు గత ప్రభుత్వంలో 28 సార్లు లేఖలు రాశారని, అయినా చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి స్పందన లేదని మంత్రి అన్నారు.
“రైతుల పరిస్థితి, విత్తనాల గురించి అధికారులు రాసిన లేఖలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపమంటే వెంటనే పంపిస్తాం” అని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.
రైతులను తెలుగుదేశం ప్రభుత్వం ముంచితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకున్నారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లోనే రైతులకు మూడు లక్షల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు సరఫరా చేసామని మంత్రి కన్నబాబు చెప్పారు.
రైతులకు విత్తనాలు సరఫరా చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి తీసుకువచ్చామని, రైతుల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి విత్తనాలు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారన్నారు.
గత ప్రభుత్వంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదని, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను దారి మళ్లించారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. రైతులను నిండా ముంచిన చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు.