గుడ్ బై చెప్పిన మంచి నటి
ఒకే ఒక్క సినిమాతో వండర్స్ సృష్టిస్తారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైపోతారు. అలాంటి చాలామంది హీరోయిన్లను పరిశ్రమ చూసింది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో బాలీవుడ్ నటి చేరిపోయింది. దంగల్ సినిమాలో బాలనటిగా మెప్పించిన జహీరా వాసిం యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేసింది. ఇకపై తను నటించలేనని ఫేస్ బుక్ లో ప్రకటించింది. దంగల్ లో ఆమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అందంగా కనిపిస్తూనే ఎంతో కష్టపడి నటించిందామె. […]
ఒకే ఒక్క సినిమాతో వండర్స్ సృష్టిస్తారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైపోతారు. అలాంటి చాలామంది హీరోయిన్లను పరిశ్రమ చూసింది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో బాలీవుడ్ నటి చేరిపోయింది. దంగల్ సినిమాలో బాలనటిగా మెప్పించిన జహీరా వాసిం యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేసింది. ఇకపై తను నటించలేనని ఫేస్ బుక్ లో ప్రకటించింది.
దంగల్ లో ఆమె నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. అందంగా కనిపిస్తూనే ఎంతో కష్టపడి నటించిందామె. కానీ ముస్లిం కమ్యూనిటీలోని నిబంధనలు ఆమె కెరీర్ కు అడ్డంగా మారాయి. ఎన్నో బెదిరింపులు వచ్చాయి. వాటిని తట్టుకొని నిలబడినప్పటికీ చివరికి మతవాదమే నెగ్గింది. తను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు జహిరా ప్రకటించింది.
“ఐదేళ్ల కిందట నేను తీసుకున్న ఓ నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. అయితే నేను ఈ పరిశ్రమకు సూటయ్యే వ్యక్తినే అయినప్పటికీ, నేను ఇక్కడ ఉండకూడదని నాకు అర్థమైంది. ఈ పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది. అదే సమయంలో నాపై నాకు నమ్మకం కోల్పోయేలా చేసింది. నేను ముస్లింను కాబట్టి నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై ఎన్నోసార్లు నేను ఎదురొడ్డి నిలబడ్డాను. కానీ ఓడిపోయాను. నా ప్రశాంతతను చెడగొట్టే వాతావరణంలో నేనిక ఉండలేను” ఇలా ఎంతో బాధగా పోస్ట్ పెట్టి సినిమా కెరీర్ ను ముగించేస్తున్నానంటూ ప్రకటించింది జహీరా వాసిం.