ప్రపంచకప్ లో పాక్ సెమీస్ ఆశలు సజీవం
అఫ్ఘనిస్థాన్ పై చచ్చీచెడి నెగ్గిన పాక్ లీడ్స్ థ్రిల్లర్లో మ్యాచ్ విన్నర్ పాక్ వన్డే ప్రపంచకప్ లో మాజీచాంపియన్ పాకిస్థాన్ నాలుగో విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకొంది. లీడ్స్ వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ 8వ రౌండ్ మ్యాచ్ లో పసికూన అప్ఘనిస్థాన్ పై మూడు వికెట్ల విజయంతో నెగ్గి ఊపిరి పీల్చుకొంది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ కీలక సమరంలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న అఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు […]
- అఫ్ఘనిస్థాన్ పై చచ్చీచెడి నెగ్గిన పాక్
- లీడ్స్ థ్రిల్లర్లో మ్యాచ్ విన్నర్ పాక్
వన్డే ప్రపంచకప్ లో మాజీచాంపియన్ పాకిస్థాన్ నాలుగో విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకొంది. లీడ్స్ వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ 8వ రౌండ్ మ్యాచ్ లో పసికూన అప్ఘనిస్థాన్ పై మూడు వికెట్ల విజయంతో నెగ్గి ఊపిరి పీల్చుకొంది.
నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ కీలక సమరంలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న అఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 227 పరుగులు సాధించింది. పాక్ యువఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదీ 4 వికెట్లు పడగొట్టాడు.
228 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన పాక్ జట్టుకు అప్ఘన్ స్పిన్నర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. అయితే …అఫ్ఘన్ అనుభవం లేమిని పాక్ లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు తెలివిగా సొమ్ము చేసుకొని 49.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 230 పరుగులతో తమ జట్టుకు కీలక విజయం అందించారు.
పాక్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర వహించిన ఆల్ రౌండర్ ఇమాద్ వాసిం కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇప్పటి వరకూ ఆడిన 8 రౌండ్ల మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో 9 పాయింట్లు సాధించి..లీగ్ టేబుల్ నాలుగో స్థానంలో నిలువగలిగింది.
పాక్ జట్టు సెమీస్ చేరాలంటే.. బంగ్లాదేశ్ తో జరిగే ఆఖరి రౌండ్ పోటీలో ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.