Telugu Global
NEWS

ప్రపంచకప్ లో రోహిత్ సెంచరీల తీన్మార్

ఇంగ్లండ్ పైనా శతకం బాదిన భారత ఓపెనర్  2019 ప్రపంచకప్ లో మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…2019 వన్డే ప్రపంచకప్ లో తన సెంచరీల వేటను కొనసాగిస్తున్నాడు. బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన మ్యాచ్ లో ఫైటింగ్ సెంచరీ సాధించడం ద్వారా…ప్రస్తుత ప్రపంచకప్ లో మూడు శతకాలు బాదిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. 338 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు…కెప్టెన్ […]

ప్రపంచకప్ లో రోహిత్ సెంచరీల తీన్మార్
X
  • ఇంగ్లండ్ పైనా శతకం బాదిన భారత ఓపెనర్
  • 2019 ప్రపంచకప్ లో మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…2019 వన్డే ప్రపంచకప్ లో తన సెంచరీల వేటను కొనసాగిస్తున్నాడు. బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన మ్యాచ్ లో ఫైటింగ్ సెంచరీ సాధించడం ద్వారా…ప్రస్తుత ప్రపంచకప్ లో మూడు శతకాలు బాదిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.

338 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు…కెప్టెన్ విరాట్ కొహ్లీతో కలసి రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన రోహిత్.. మొత్తం 109 బాల్స్ లో 15 బౌండ్రీలతో 102 పరుగులు సాధించి అవుటయ్యాడు.

ప్రపంచకప్ లో రోహిత్ కు ఇది మూడో సెంచరీకాగా…వన్డే క్రికెట్లో 25 శతకం కావడం విశేషం.

సౌతాఫ్రికాపై తొలి శతకం

ప్రస్తుత ప్రపంచకప్ లో…సౌతాఫ్రికా పై 122 పరుగులతో తొలిశతకం బాదిన రోహిత్…చిరకాల ప్రత్యర్థి పాక్ పై రెండో సెంచరీ సాధించాడు.

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో రోహిత్ మూడంకెల స్కోరు సాధించాడు.

యువఆటగాడు రాహుల్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ మొదటి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.

మొత్తం 113 బాల్స్ లో 3 సిక్సర్లు, 14 బౌండ్రీలతో 140 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. 84 బాల్స్ లోనే వంద పరుగులు సాధించిన రోహిత్… కేవలం 34 బాల్స్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించడం కూడా రికార్డుగా నిలిచింది.

212 వన్డేల్లో 25 సెంచరీలు…

పాకిస్థాన్ ప్రత్యర్థిగా ప్రపంచకప్ లో శతకం బాదిన రెండో భారత క్రికెటర్ ఘనతను రోహిత్ శర్మ సొంతం చేసుకొన్నాడు. 2015 ప్రపంచకప్ లో…. పాక్ పై విరాట్ కొహ్లీ సెంచరీ సాధించడం ద్వారా …భారత తొలి క్రికెటర్ గా నిలిచాడు.

ఇంగ్లండ్ తో జరిగిన ప్రస్తుత మ్యాచ్ వరకూ…తన కెరియర్ లో 212 వన్డేలు ఆడిన రోహిత్ శర్మకు…25 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలతో సహా..8వేల 400కు పైగా పరుగులు సాధించిన రికార్డు ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్ లో రెండేసి సెంచరీలు సాధించిన ఆటగాళ్ళలో జో రూట్, షకీబుల్ హసన్, కేన్ విలియమ్స్ సన్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ ఉన్నారు.

First Published:  30 Jun 2019 5:04 PM IST
Next Story