Telugu Global
Cinema & Entertainment

క్రికెటర్ తో షార్ట్ ఫిలిం తీస్తున్న.... ప్రముఖ నిర్మాణ సంస్థ

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతిలో ప్రస్తుతం చాలానే పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. సమంత నటిస్తున్న ‘ఓ బేబీ’, వెంకటేష్ నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’, అనుష్క, మాధవన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ‘సైలెన్స్’, నాగ శౌర్య తో మరొక సినిమా నిర్మిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ఒక ప్రముఖ క్రికెటర్ తో కలిసి షార్ట్ ఫిలిం తీసేందుకు సిద్ధమైంది. ఆ క్రికెటర్ ఎవరో కాదు వెస్టిండీస్ కి […]

క్రికెటర్ తో షార్ట్ ఫిలిం తీస్తున్న.... ప్రముఖ నిర్మాణ సంస్థ
X

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతిలో ప్రస్తుతం చాలానే పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. సమంత నటిస్తున్న ‘ఓ బేబీ’, వెంకటేష్ నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’, అనుష్క, మాధవన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ‘సైలెన్స్’, నాగ శౌర్య తో మరొక సినిమా నిర్మిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా ఒక ప్రముఖ క్రికెటర్ తో కలిసి షార్ట్ ఫిలిం తీసేందుకు సిద్ధమైంది. ఆ క్రికెటర్ ఎవరో కాదు వెస్టిండీస్ కి చెందిన డ్వేన్ బ్రావో.

తాజా సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక షార్ట్ ఫిలిం నిర్మించనుంది. ఈ సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించారు.

ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) లో భాగంగా ఒక షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శనివారం ఒప్పందాలు జరిగాయి.

ఈ క్రమంలో లో విశ్వ ప్రసాద్ తో డ్వేన్ బ్రావో కూడా పాల్గొన్నారు. సోషల్ ఎవేర్నెస్ మీద సాగే ఈ లఘు చిత్రం షూటింగ్ కోయంబత్తూరు తమిళ్ నాడు లో మాత్రమే కాక వెస్టిండీస్ లోని ట్రినిడాడ్ టొబాగో లో కూడా జరుగనుంది. రేపటి నుంచి ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం.

First Published:  30 Jun 2019 6:25 AM IST
Next Story