Telugu Global
NEWS

లోకేష్‌కు ఆ ప‌ద‌విపై మోజు.... చంద్ర‌బాబుకు సీనియ‌ర్ల ఝ‌ల‌క్ !

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ అయ్యారు. ఇటు వైఎస్ జ‌గ‌న్ సీఎం అయ్యారు. త‌న కొడుకు మాత్రం ఎమ్మెల్సీగా ఉన్నాడు. అత‌నికి కూడా పార్టీలో మంచి ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు స్కెచ్‌గీస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి కోరుతున్న‌ట్లు స‌మాచారం. పార్టీలో లోకేష్ ప్రాధాన్య‌త పెంచేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని చంద్రబాబు ఆలోచిస్తున్నార‌ట‌. లోకేష్ ప్రాధాన్య‌త పెంచేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను గ‌మ‌నిస్తున్న సీనియ‌ర్లు వాటిని అడ్డుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. ముఖ్యంగా లోకేష్‌తో […]

లోకేష్‌కు ఆ ప‌ద‌విపై మోజు.... చంద్ర‌బాబుకు సీనియ‌ర్ల ఝ‌ల‌క్ !
X

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ అయ్యారు. ఇటు వైఎస్ జ‌గ‌న్ సీఎం అయ్యారు. త‌న కొడుకు మాత్రం ఎమ్మెల్సీగా ఉన్నాడు. అత‌నికి కూడా పార్టీలో మంచి ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు స్కెచ్‌గీస్తున్నారు.

అయితే లోకేష్ మాత్రం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి కోరుతున్న‌ట్లు స‌మాచారం. పార్టీలో లోకేష్ ప్రాధాన్య‌త పెంచేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని చంద్రబాబు ఆలోచిస్తున్నార‌ట‌.

లోకేష్ ప్రాధాన్య‌త పెంచేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను గ‌మ‌నిస్తున్న సీనియ‌ర్లు వాటిని అడ్డుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. ముఖ్యంగా లోకేష్‌తో గ్యాప్ ఉన్న సుజ‌నా చౌద‌రి, గ‌రిక‌పాటి మోహ‌న‌రావు, టీజీ వెంక‌టేష్ వంటి నేతుల జంప్ అయ్యారు.

ఇక ఆయ‌న‌తో గ్యాప్ ఉన్న కాపు నేత‌లు కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. లోకేష్‌కు బాధ్య‌తలు ఇస్తే ఏం చేయాలి? అని కాకినాడ‌లో ఇటీవ‌ల స‌మావేశం అయిన కాపు నేత‌లు చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. లోకేష్‌కు ప‌ద‌వి ఇస్తే పార్టీ వీడి వేరే పార్టీలోకి వెళ్లాల‌ని ఈ నేత‌లు అనుకున్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు లోకేశ్ తీరు పైన పార్టీలోనూ అసంతృప్తి క‌నిపిస్తోంది. సీనియ‌ర్ నేత‌లు ఎవరూ ఆయ‌న‌కు స‌హ‌క‌రించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. లోకేష్ నిర్ణ‌యాల వ‌ల్లే మొన్న‌టి ఎన్నిక‌ల్లో పార్టీ తీవ్రంగా దెబ్బ‌తింద‌ని నేత‌ల అభిప్రాయం.

బీజేపీతో దోస్తీ విడిపోవ‌డానికి లోకేష్ కార‌ణ‌మ‌ని నేత‌లు అంటున్నారు. తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, సీనియ‌ర్ల‌ను సంప్ర‌దించ‌క‌పోవ‌డం లోకేష్‌కు అల‌వాటు అని నేత‌లు మండిప‌డుతున్నారు.

మొత్తానికి లోకేష్‌కు ప‌ద‌వి ఇస్తే మాత్రం పార్టీలో సీనియ‌ర్లు జంప్ కావ‌డం ఖాయమ‌ని అంటున్నారు.

First Published:  30 Jun 2019 3:13 AM IST
Next Story