పోలీస్ ఆఫీసర్‌పై దాడి... కఠిన చర్యలు తీసుకున్న కేసీఆర్
ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై దాడి ఘటన పట్ల సీఎం కేసీఆర్ సీరియస్‌గా స్పందించారు. అనితపై కర్రలతో మోదిన ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ పదవి ఊడింది. ఘటనపై సీరియస్‌గా స్పందించిన కేసీఆర్ తక్షణం పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోనేరు కృష్ణను ఆదేశించారు. దాంతో అతడు జిల్లా కలెక్టర్‌ను కలిసి జెడ్పీ వైస్ చైర్మన్ పదవితో పాటు జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా సమర్పించారు. కోనేరు కృష్ణపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. […]
ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై దాడి ఘటన పట్ల సీఎం కేసీఆర్ సీరియస్‌గా స్పందించారు. అనితపై కర్రలతో మోదిన ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ పదవి ఊడింది.
ఘటనపై సీరియస్‌గా స్పందించిన కేసీఆర్ తక్షణం పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోనేరు కృష్ణను ఆదేశించారు. దాంతో అతడు జిల్లా కలెక్టర్‌ను కలిసి జెడ్పీ వైస్ చైర్మన్ పదవితో పాటు జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా సమర్పించారు.
కోనేరు కృష్ణపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అతడితో పాటు పోలీసు అధికారిణిపై దాడి చేసిన మరో 16 మంది పైనా కేసు నమోదు చేశారు. 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే రాజీనామా లేఖలో కోనేరు కృష్ణ… పోడు భూముల రైతులపై అటవీ సిబ్బంది జులుంకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.