అటవీ శాఖ అధికారిణిపై ఎమ్మెల్యే తమ్ముడు దాడి !
అసిపాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్టు డిపార్ట్‌మెంట్ రేంజ్ ఆఫీసర్ అనితపై సార్సాల గ్రామంలో దాడి జరిగింది. జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులు అటవీ శాఖ అధికారిపై దాడికి పాల్పడ్డారు. సార్సాల గ్రామ శివారు అటవీ పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లారు. భూములను సాగు చేసేందుకు వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత,50 మంది సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో గ్రామస్తులను కొందరిని పోలీసుస్టేషన్‌కు […]
అసిపాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్టు డిపార్ట్‌మెంట్ రేంజ్ ఆఫీసర్ అనితపై సార్సాల గ్రామంలో దాడి జరిగింది. జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులు అటవీ శాఖ అధికారిపై దాడికి పాల్పడ్డారు.
సార్సాల గ్రామ శివారు అటవీ పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లారు. భూములను సాగు చేసేందుకు వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత,50 మంది సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో గ్రామస్తులను కొందరిని పోలీసుస్టేషన్‌కు తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్రమంగా గొడవ పెరిగి అధికారులపై గ్రామస్తులు దాడులకు దిగారు.
తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు ఎలా నాటుతారని ఫారెస్టు అధికారులతో గ్రామస్తులు గొడవకు దిగారు. ఈక్రమంలో అక్కడికి చేరకున్న జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణ, అనుచరులు ఫారెస్టు అధికారులపై దాడులు చేశారు. పెద్దపెద్ద కర్రలతో వారిని తలలు పగిలేలా కొట్టారు.
సంఘటనా స్థలంలో ఉండి దాడికి ప్రోత్సహించారని, దాడి చేశారని ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సోదరుడు జడ్పీ వైస్ ఛైర్మన్ కృష్ణపై ఫారెస్టు అధికారులు ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాల అటవీ భూమిని మళ్లించారు. దీనికి బదులుగా కేటాయించిన భూముల్లో అటవీకరణ వేగంగా జరగాలని ప్రభుత్వం అటవీశాఖను ఆదేశించింది.
ఆమేరకు క్షేత్ర స్థాయిలో అటవీ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఈక్రమంలోనే పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సోదరుడు కృష్ణ సహా రైతులు దాడికి దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది.