Telugu Global
NEWS

ప్రపంచకప్ లో ఆతిథ్య ఇంగ్లండ్ కు డూ ఆర్ డై

7 రౌండ్లలో 3 పరాజయాలతో ఇంగ్లండ్ డీలా  భారత్, న్యూజిలాండ్ జట్లపై నెగ్గితేనే సెమీస్ బెర్త్  మాజీ కెప్టెన్ల విమర్శలతో ఇంగ్లండ్ కు టెన్షన్ టెన్షన్ ప్రపంచకప్ కు ఐదోసారి ఆతిథ్యమిస్తున్న ప్రపంచ రెండో ర్యాంకర్, హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ జట్టుకు ఆ ఆనందమే లేకుండా పోయింది. పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన ఏడురౌండ్ల మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో.. సెమీస్ బెర్త్ ఆశలను క్లిష్టంగా మార్చుకొంది. దీనికితోడు […]

ప్రపంచకప్ లో ఆతిథ్య ఇంగ్లండ్ కు డూ ఆర్ డై
X
  • 7 రౌండ్లలో 3 పరాజయాలతో ఇంగ్లండ్ డీలా
  • భారత్, న్యూజిలాండ్ జట్లపై నెగ్గితేనే సెమీస్ బెర్త్
  • మాజీ కెప్టెన్ల విమర్శలతో ఇంగ్లండ్ కు టెన్షన్ టెన్షన్

ప్రపంచకప్ కు ఐదోసారి ఆతిథ్యమిస్తున్న ప్రపంచ రెండో ర్యాంకర్, హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ జట్టుకు ఆ ఆనందమే లేకుండా పోయింది.

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన ఏడురౌండ్ల మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, మూడు పరాజయాలతో..
సెమీస్ బెర్త్ ఆశలను క్లిష్టంగా మార్చుకొంది.

దీనికితోడు మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్ విమర్శలదాడి ప్రారంభించడంతో…ఇంగ్లండ్ జట్టు అయోమయంలో చిక్కుకొంది.

నంబర్ వన్ ర్యాంక్ తో మొదలై….

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు…ఇంగ్లండ్ జట్టు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా మాత్రమే కాదు…హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా టైటిల్ వేటకు దిగింది. 50 ఓవర్ల ఫార్మాట్లో 300 కు పైగాస్కోర్లను అలవోకగా సాధిస్తూ తనకుతానే సాటిగా నిలిచింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అత్యంత సమతూకంతో…అతి ప్రమాదకరమైన జట్టుగా గుర్తింపు పొందిన ఇంగ్లండ్ కు…ఓపెనర్ జేసన్ రాయ్ గాయం అశనిపాతంగా మారింది.

రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన ఏడురౌండ్ల మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, మూడు పరాజయాల రికార్డుతో లీగ్ టేబుల్ నాలుగో స్థానంలో నిలిచింది.

లీగ్ దశలో పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల చేతిలో పరాజయాలు పొందిన ఇంగ్లండ్…అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా , వెస్టిండీస్ జట్ల పై విజయాలు సాధించడం ద్వారా 8 పాయింట్లు మాత్రమే సంపాదించింది.

సెమీస్ చేరాలంటే….

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో జట్టు ఏదైనా సెమీస్ చేరాలంటే కనీసం ఆరుమ్యాచ్ లు నెగ్గితీరాల్సి ఉంది. పైగా నెట్ రన్ రేట్ సైతం కీలకంగా మారింది.

ఆదివారం జరిగే ఎనిమిదోరౌండ్ పోటీలో…పవర్ ఫుల్ భారత్ ను ఇంగ్లండ్ ఓడించితీరాల్సి ఉంది. అంతేకాదు…ఆఖరి రౌండ్ పోటీలో సైతం .. న్యూజిలాండ్ పైన సైతం ఇంగ్లండ్ నెగ్గితీరాల్సి ఉంది.

భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ మూడు బెర్త్ లు ఖాయం చేసుకోడంతో…ఆఖరి బెర్త్ కోసం బంగ్లాదేశ్, పాక్ జట్లతో.. ఇంగ్లండ్ పోటీపడుతోంది.

ఇంట్లో ఈగల మోత…..

ప్రపంచకప్ టైటిల్ వేటకు నంబర్ వన్ జట్టుగా దిగి…మూడు పరాజయాలతో టాప్ ర్యాంక్ చేజార్చుకోడమే కాదు…చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో 64 పరుగుల ఘోరపరాజయం పొందిన తీరును మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్ తప్పుపడుతున్నారు. ప్రస్తుత ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ఘోరవైఫల్యం పొందక తప్పదని హెచ్చరిస్తున్నారు.

అయితే…తమజట్టుకు ఇంటిపోరు ఎక్కువయ్యిందని…తమ ఓటమిని కోరుకొనే వారే ఎక్కువయ్యారంటూ…ఓపెనర్ జానీ బెయిర్ స్టో మండి పడుతున్నాడు.

తమజట్టు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో అండగా నిలవాల్సిన మాజీ కెప్టెన్లు,విమర్శకులు..అర్థంపర్థం లేని విమర్శలతో అనవసరమైన ఒత్తిడి పెంచుతున్నారంటూ వాపోతున్నాడు.

ఏదిఏమైనా…ఇప్పటికే పలుసార్లు ప్రపంచకప్ రన్నరప్ స్థానాలు సాధించిన ఇంగ్లండ్..విశ్వవిజేతగా నిలవాలన్న కలలు కల్లలుగా మిగిలిపోయే ప్రమాదమే కనిపిస్తోంది.

భారత్ లేదా న్యూజిలాండ్ జట్లతో జరిగే మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ ఏ ఒక్కటి ఓడినా లీగ్ దశ నుంచే అవమానకరమైన రీతిలో నిష్క్రమించక తప్పదు.

First Published:  30 Jun 2019 3:15 AM IST
Next Story