డాక్టర్‌పై ఆడవాళ్లను ప్రయోగించిన మరో డాక్టర్
వరంగల్‌లో డాక్టర్ల మధ్య ఆధిపత్యపోరు శృతి మించింది. వరంగల్‌లో బాలాజీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధీర్‌కు…బ్యాంకు కాలనీలో ఉంటున్న మరో డాక్టర్ నాగేశ్వరరావుకు మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. దీంతో ఎలాగైనా డాక్టర్ సుధీర్‌ను అల్లరి చేసి బాలాజీ ఆస్పత్రి పరువు తీయాలని డాక్టర్ నాగేశ్వరరావు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం హన్మకొండకు చెందిన రాంబాబు, వెంకటేశ్వరరావుల సాయం తీసుకున్నాడు. డాక్టర్ సుధీర్‌ను అల్లరి పట్టించాలని… కేసు నమోదు అయ్యేలా చూడాలని ఐదు లక్షలకు డీల్ చేసుకున్నాడు. డాక్టర్ సుధీర్‌పై సాధారణ […]
వరంగల్‌లో డాక్టర్ల మధ్య ఆధిపత్యపోరు శృతి మించింది. వరంగల్‌లో బాలాజీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధీర్‌కు…బ్యాంకు కాలనీలో ఉంటున్న మరో డాక్టర్ నాగేశ్వరరావుకు మధ్య ఆధిపత్యపోరు మొదలైంది.
దీంతో ఎలాగైనా డాక్టర్ సుధీర్‌ను అల్లరి చేసి బాలాజీ ఆస్పత్రి పరువు తీయాలని డాక్టర్ నాగేశ్వరరావు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం హన్మకొండకు చెందిన రాంబాబు, వెంకటేశ్వరరావుల సాయం తీసుకున్నాడు. డాక్టర్ సుధీర్‌ను అల్లరి పట్టించాలని… కేసు నమోదు అయ్యేలా చూడాలని ఐదు లక్షలకు డీల్ చేసుకున్నాడు.
డాక్టర్ సుధీర్‌పై సాధారణ కేసు నమోదు అయ్యేలా చేస్తే లక్షన్నర, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యేలా చేస్తే ఐదు లక్షలు ఇస్తానని రాంబాబు, వెంకటేశ్వరరావుతో నాగేశ్వరరావు ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారం సంధ్య అనే మహిళను వెంటపెట్టుకుని రాంబాబు, వెంకటేశ్వరరావులు బాలాజీ ఆస్పత్రికి వెళ్లారు.
సాధారణ పేషెంట్ తరహాలో మహిళకు టోకెన్ తీసుకున్నారు. ఎముకల డాక్టర్ అయిన సుధీర్ వద్దకు వెళ్లిన సంధ్య … తనకు పక్కటెముకల్లో నొప్పి ఉందని చెప్పింది. దాంతో నొప్పి భాగాన్ని పరిశీలించేందుకు డాక్టర్ ప్రయత్నించారు. అంతే ఒక్కసారిగా డాక్టర్‌పై విరుచుకుపడింది. తనను తాకకూడని చోట డాక్టర్ తాకారని… అసభ్యకరంగా ప్రవర్తించారని గొడవ చేసింది.
ఇంతలో బయట ఉన్న రాంబాబు, వెంకటేశ్వరరావు వచ్చి గట్టిగట్టిగా కేకలు వేస్తూ హంగామా సృష్టించారు. సంధ్యను డాక్టర్ పరీక్షిస్తున్న సమయంలో అక్కడ ఇతర మహిళా పేషెంట్లు కూడా ఉన్నారు.
నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కిలాడి లేడీ … డాక్టర్ సుధీర్‌పై కేసు పెట్టింది. తాను అసభ్యకరంగా ప్రవర్తించలేదని… కావాలంటే సీసీ ఫుటేజ్‌ను పరిశీలించాలని డాక్టర్ కూడా పోలీసులను కోరారు. తనను కావాలనే అల్లరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ డాక్టర్ కూడా ఎదురు కేసు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
సంధ్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను గట్టిగా విచారించగా.. అసలు విషయం చెప్పేసింది. డాక్టర్ నాగేశ్వరరావుతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే డాక్టర్ సుధీర్‌ను అల్లరి చేసి ఆస్పత్రి పరువు తీసేందుకు ఇదంతా చేశానని అంగీకరించింది.
ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి ఐదు లక్షలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేసినట్టు అంగీకరించింది. పోలీసులు రాంబాబు, వెంకటేశ్వరరావు, సంధ్యలను అరెస్ట్ చేశారు. కుట్రకు సూత్రధారి అయిన డాక్టర్ నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు.