రేపటి నుంచి బాబు ఇటువైపు రారు " రాయపాటి
చంద్రబాబునాయుడు కరకట్ట నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరో ఇంటికి మారుతున్నారు. చంద్రబాబుతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భేటీ అయి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాయపాటి… చంద్రబాబు పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబును నమ్ముకుని భూములిచ్చిన వారు చంద్రబాబును స్థానికంగానే ఉండాలని కోరుతున్నట్టు చెప్పారు. రేపటి నుంచి లింగమనేని భవనానికి చంద్రబాబు రాబోరని రాయపాటి చెప్పారు. ప్రస్తుతం గుంటూరులోని పార్టీ కార్యాలయం వేదికగా చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తారని […]
చంద్రబాబునాయుడు కరకట్ట నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరో ఇంటికి మారుతున్నారు. చంద్రబాబుతో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భేటీ అయి చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన రాయపాటి… చంద్రబాబు పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబును నమ్ముకుని భూములిచ్చిన వారు చంద్రబాబును స్థానికంగానే ఉండాలని కోరుతున్నట్టు చెప్పారు.
రేపటి నుంచి లింగమనేని భవనానికి చంద్రబాబు రాబోరని రాయపాటి చెప్పారు. ప్రస్తుతం గుంటూరులోని పార్టీ కార్యాలయం వేదికగా చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.
చంద్రబాబు కోసం తన నివాసాన్ని కూడా ఆఫర్ చేసినట్టు మాజీ ఎంపీ వివరించారు. భద్రత వ్యవహారాల ఆధారంగా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. హోటల్‌లో ఉంటూ పార్టీ కార్యాలయం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తారా? అన్నది కూడా చూడాలన్నారు.