పాల ప్యాకెట్లను అలా కత్తిరించవద్దు.. అధికారుల విజ్ఞప్తి
ప్రపంచాన్ని ఇప్పుడు ప్లాస్టిక్ భూతం పట్టిపీడిస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి అవుతోంది. పాలను కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లలోనే సరఫరా చేస్తున్నారు. దీంతో మెట్రో నగరాల్లో నిత్యం లక్షలాది ఖాళీ పాలప్యాకెట్లు పేరుకుపోతున్నాయి. వాటిని సేకరించి రీసైక్లింగ్ చేయిస్తున్నారు. అయితే పాల ప్యాకెట్లను ఇళ్లలో కత్తిరిస్తున్న విధానం సవాల్‌గా మారింది. చాలా మంది పాలప్యాకెట్‌ను కత్తిరించే సమయంలో చిన్న ముక్క వేరుపడేలా కత్తిరిస్తున్నారు. […]
ప్రపంచాన్ని ఇప్పుడు ప్లాస్టిక్ భూతం పట్టిపీడిస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి అవుతోంది. పాలను కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లలోనే సరఫరా చేస్తున్నారు. దీంతో మెట్రో నగరాల్లో నిత్యం లక్షలాది ఖాళీ పాలప్యాకెట్లు పేరుకుపోతున్నాయి. వాటిని సేకరించి రీసైక్లింగ్ చేయిస్తున్నారు.
అయితే పాల ప్యాకెట్లను ఇళ్లలో కత్తిరిస్తున్న విధానం సవాల్‌గా మారింది. చాలా మంది పాలప్యాకెట్‌ను కత్తిరించే సమయంలో చిన్న ముక్క వేరుపడేలా కత్తిరిస్తున్నారు. దాంతో ఆ చిన్నచిన్న ప్లాస్టిక్ కవర్ల ముక్కలు రీసైక్లింగ్‌కు వెళ్లడం లేదు. అవి పేరుకుపోతున్నాయి. ఈ సమస్య పట్ల బెంగళూరులో అధికారులు ప్రచారం చేస్తున్నారు.
పాల ప్యాకెట్లను కత్తిరించే సమయంలో చిన్న ముక్క వేరుపడేలా కాకుండా… ప్యాకెట్‌కే అతుక్కుని ఉండేలా చిన్న రంధ్రం మాత్రమే చేసి పాలు తీసుకోవాలని కోరుతున్నారు. అలా కాకుండా ప్లాస్టిక్ ముక్క వేరుపడేలా కత్తిరించడం వల్ల కోట్లాది చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలు రీసైక్లింగ్ కు వెళ్లకుండా పేరుకుపోతున్నాయని దీని వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని చెబుతున్నారు.