కృష్ణాజిల్లాలో గట్టిగానే అమ్మ ఒడి ఎఫెక్ట్
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం స్పష్టమైన ప్రభావం చూపుతోంది. ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఈ పథకం వర్తింపచేయడంపై విమర్శలు ఉన్నా…పిల్లలంతా బడి బాట పట్టడానికి ఈ పథకం బాగానే ఉపయోగపడుతోంది. కృష్ణా జిల్లాలో అమ్మ ఒడి కారణంగా రికార్డు స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు జరిగాయి. జిల్లా విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఒక్క కృష్ణాజిల్లాలో లక్షా 51వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది చేరారు. గడిచిన చాలా […]
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం స్పష్టమైన ప్రభావం చూపుతోంది. ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఈ పథకం వర్తింపచేయడంపై విమర్శలు ఉన్నా…పిల్లలంతా బడి బాట పట్టడానికి ఈ పథకం బాగానే ఉపయోగపడుతోంది.
కృష్ణా జిల్లాలో అమ్మ ఒడి కారణంగా రికార్డు స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు జరిగాయి. జిల్లా విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఒక్క కృష్ణాజిల్లాలో లక్షా 51వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది చేరారు.
గడిచిన చాలా ఏళ్లుగా చూస్తే జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో గరిష్ట స్థాయిలో అడ్మిషన్లు జరగడం ఇదే తొలిసారి అని జిల్లా విద్యాశాఖ అధికారి రవికుమార్ వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా పూర్తిస్థాయిలో అడ్మిషన్లు జరగడానికి ప్రధాన కారణం అమ్మ ఒడి పథకమేనని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2వేల 610 స్కూళ్లు ఉండగా…. ప్రతి ఏడాది విద్యా శాఖ అధికారులు పిల్లల కోసం వెతికినట్టుగా పరిస్థితి ఉండేది.
పిల్లలను స్కూళ్లకు ఆకర్షించేందుకు బడి బాట కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ అవేవీ పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదని… కానీ అమ్మ ఒడి పథకం కారణంగా… తల్లిదండ్రులే పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్చేందుకు పోటీ పడుతున్నారని చెబుతున్నారు.
ప్రైవేట్ స్కూళ్లకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తున్నప్పటికీ… ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపితే ఆ డబ్బు ఫీజులకే సరిపోతుందన్న భావన కూడా కొందరి తల్లిదండ్రుల్లో ఉందని… దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం కూడా పిల్లలను, వారి తల్లిదండ్రులను ప్రభుత్వ స్కూళ్లు ఆకర్షించడానికి ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు.